Saripodhaa Sanivaaram : పుష్పకి పోటీగా నాని.. ఆగస్టులో ‘సరిపోదా శనివారం’ రిలీజ్..!
పుష్పకి పోటీగా నాని రాబోతున్నారా..? ఆగస్టులో 'సరిపోదా శనివారం' రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న నిర్మాతలు.

Nani Saripodhaa Sanivaaram movie will aiming to august release on pushpa 2 date
Saripodhaa Sanivaaram : నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన 31వ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘అంటే సుందరానికి’ వంటి హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ సినిమా చేసిన వివేక్ ఆత్రేయ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈ మూవీకి ‘సరిపోదా శనివారం’ అనే క్రేజీ టైటిల్ ని పెట్టారు. డివివి దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.
ఇక ఈ మూవీని ఆగష్టులోనే ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఆగష్టు 15న పుష్ప 2 వచ్చేందుకు డేట్ ని ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ కొన్ని రోజుల నుంచి.. ఆ మూవీ పోస్టుపోన్ అయ్యే ఛాన్స్ ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఒకవేళ ఆ తేదికి పుష్ప రాకపోతే.. ఆ డేట్ ని కబ్జా చేసేందుకు కొందరు నిర్మాతలు తమ సినిమాలతో క్యూలో ఉన్నారు.
Also read : OG Movie : పవన్ ఓజి రిలీజ్ డేట్ ఫిక్స్.. విడుదలకు ఆ ఇండస్ట్రీ హిట్టు తేదీని..
ఆ నేపథ్యంలోనే డివివి కూడా వేచి చూస్తున్నారు. ఆగష్టు 15కి పుష్ప 2 రాకుంటే.. ‘సరిపోదా శనివారం’ చిత్రాన్ని రిలీజ్ చేస్తామంటూ డివివి చెబుతున్నారు. మరి పుష్ప వెనక్కి తగ్గుతాడా..? లేదా తగ్గేదేలే అంటూ అదే తేదికి వచేస్తాడా..? అనేది చూడాలి. అయితే ఈ రిలీజ్ డేట్ మాత్రమే కాదు, ‘దేవర’ విడుదల తేదీ పై కూడా చర్చ నడుస్తుంది. దేవర కూడా పోస్టుపోన్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది.
ఒకవేళ ఆ వార్త నిజమైతే.. ఆ తేదికి విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ని తీసుకు వస్తామంటూ దిల్ రాజు ప్రకటించారు. ప్రస్తుతం చాలామంది నిర్మాతలు.. ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ పై క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ చిత్రాలు వాయిదా పడితే.. మళ్ళీ వాటి కొత్త రిలీజ్ డేట్స్ ఏంటని కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే, సెప్టెంబర్ లో గేమ్ ఛేంజర్, OG చిత్రాల రిలీజ్‌లు కూడా ఉన్నాయి.