OG Movie : పవన్ కళ్యాణ్ ఓజి రిలీజ్ డేట్ ఫిక్స్.. విడుదలకు ఆ ఇండస్ట్రీ హిట్టు తేదీని..
పవన్ కళ్యాణ్ OG రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. గతంలో పవన్ కి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఆ సినిమా విడుదల తేదీకే..

Pawan kalyan Priyanka Mohan Sujeeth OG Movie release date fixed
OG Movie : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సినిమా ‘OG’. సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్స్ నేపథ్యంతో తెరకెక్కుతుంది. పంజా, బాలు సినిమాల తరువాత పవన్ నుంచి మళ్ళీ అలాంటి ఓ గ్యాంగ్‌స్టర్ మూవీని అభిమానులు కోరుకుంటున్నారు. దీంతో ఓజీ మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.
షూటింగ్ మొదలు పెట్టుకొని శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న.. ఈ చిత్రం ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లోనే ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుందని భావించారు. కానీ షూటింగ్ చివరి దశకు వచ్చిన తరువాత చిత్రీకరణని పక్కన పెట్టేయడం, నిర్మాతలు కూడా ఇప్పటిలో సినిమా గురించి ఏ అప్డేట్ అడగకండి అంటూ అధికారికంగా చెప్పడంతో.. ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ లో రిలీజ్ ఉండడం కష్టం అనుకున్నారు.
Also read : బేబీ కలెక్షన్స్ 100 కోట్ల గురించి నిర్మాత SKN ఏం చెప్పాడంటే?
ఇప్పుడు అందరూ అనుకున్నట్లే అయ్యింది. ఈ మూవీ ఈ ఏడాది సెకండ్ హాఫ్ లో రాబోతుంది. సెప్టెంబర్ 27న ఈ మూవీని రిలీజ్ చేసేందుకు డేట్ ని ఫిక్స్ చేశారట. అదే తేదీన గతంలో పవన్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆ గోల్డెన్ డేట్‌పైనే ఓజి నిర్మాతల కూడా దృష్టి పెట్టారంట. ప్రస్తుతానికి చిత్ర నిర్మాతల నుంచి మాత్రం ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే ఆ అప్డేట్ ని ఫ్యాన్స్ కి తెలియజేయనున్నారు.
కాగా ఈ సినిమాని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. అలాగే తమిళ నటుడు అర్జున్ దాస్, శ్రియా రెడ్డి ముఖ్య పాత్రలు చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. 90s బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా సాగనుంది. ఈ సినిమాలో పవన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని శ్రియా రెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.