Site icon 10TV Telugu

Nani : నాని ఫేవరేట్ టీచర్ ఎవరో? నాని గురించి ఏం చెప్పారో తెలుసా?.. టెన్త్ క్లాస్ లోనే..

Nani Meets his Favorite Teacher and Tells Interesting Things

Nani

Nani : నాని మొదట సినీ పరిశ్రమలోకి డైరెక్టర్ అవుదామని వచ్చిన సంగతి తెలిసిందే. పలు సినిమాలకు దర్శకత్వ శాఖలో పనిచేసి అవకాశం రావడంతో హీరోగా మారాడు నాని. ఇప్పుడు న్యాచురల్ స్టార్ గా ఎదిగి వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. తాజాగా నాని జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకి గెస్ట్ గా రావడంతో ఈ షోలో అనేక ఆసక్తికర అంశాలు తెలిపారు.(Nani)

ఈ క్రమంలో తన స్టూడెంట్ లైఫ్ గురించి చెప్తూ.. యావరేజ్ స్టూడెంట్ అని తెలిపాడు. హైదరాబాద్ సెయింట్ ఆల్ఫాన్స్ స్కూల్ లో చదివానని, తన ఫేవరేట్ టీచర్ సుందరమ్మ. ఆవిడ నన్ను బాగా కేర్ చేసేది, ఎగ్జామ్స్ టైంలో ఇంటికి ఫోన్ చేసి మరీ చదివానా లేదా కనుక్కునేది అని తెలిపాడు.

Also Read : Mahesh Babu : రాజమౌళి వల్ల కొడుకు బర్త్ డే మిస్ అయిన మహేష్.. ఎమోషనల్ పోస్ట్.. గౌతమ్ కి ఇప్పుడు ఎన్నేళ్లు..?

ఈ క్రమంలో షో టీమ్ సుందరమ్మ టీచర్ ని తీసుకొచ్చారు. ఆమెని చూసి నాని ఆశ్చర్యపోయాడు. సంవత్సరం క్రితం చివరగా అనుకోకుండా కలిసాను అని తెలిపాడు. సుందరమ్మ టీచర్ మాట్లాడుతూ.. క్లాస్ లో నిద్రపోయేవాడు. అల్లరి ఎక్కువగా చేసేవాడు కాదు. సైలెంట్ గా ఉండేవాడు. యావరేజ్ గా చదివేవాడు. ఇతని ఫ్రెండ్ తో కలిసి ఎంజాయ్ చేసేవాడు హాలిడేస్ లో. హోమ్ వర్క్ చేయకుండా వచ్చేవాడు. తనలో యాక్షన్ పార్ట్ మాకు అప్పుడే తెలిసింది. పదవ తరగతిలో ఒక స్కిట్ వేశారు. అందులో పెళ్లికూతురు ఫాదర్ క్యారెక్టర్ చేసాడు. పెళ్ళికి ఒప్పుకోకూడదు ఆ పాత్రలో. దానికి డైలాగ్స్, డైరెక్షన్ తనే. అప్పుడే తన దగ్గర ట్యాలెంట్ ఉందని అనుకున్నాం. యాంకర్ ప్రదీప్, శర్వానంద్ కూడా మా స్కూల్ పిల్లలే. ఇంకా చాలా మంది ఉన్నారు అని తెలిపారు.

అనంతరం సుందరమ్మ టీచర్ నాని స్కూల్ లో వాళ్ళ క్లాస్ తో కలిసి దిగిన గ్రూప్ ఫోటోని గిఫ్ట్ గా తీసుకొచ్చి ఇచ్చారు. నాని తన టీచర్ కాళ్లకు నమస్కరించి త్వరలో ఇంటికి వస్తానని చెప్పారు.

Also Read : Nani : ఒక రిసెప్షనిస్ట్ చేసిన తప్పు వల్ల ‘నాని’ పేరే మారిపోయిందిగా.. పాపం.. ఇప్పటికీ అలాగే..

Exit mobile version