Mahesh Babu : రాజమౌళి వల్ల కొడుకు బర్త్ డే మిస్ అయిన మహేష్.. ఎమోషనల్ పోస్ట్.. గౌతమ్ కి ఇప్పుడు ఎన్నేళ్లు..?
మహేష్ తనయుడు గౌతమ్ పుట్టిన రోజు కావడంతో మొదటిసారి నీ బర్త్ డే ని మిస్ అవుతున్నాను అంటూ మహేష్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.(Mahesh Babu)

Mahesh Babu
Mahesh Babu : మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఆఫ్రికా కెన్యా దేశంలో ఈ షూటింగ్ జరుగుతుంది. అయితే నేడు మహేష్ తనయుడు గౌతమ్ ఘట్టమనేని పుట్టిన రోజు కావడంతో మొదటిసారి నీ బర్త్ డే ని మిస్ అవుతున్నాను అంటూ మహేష్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు.(Mahesh Babu)
మహేష్ బాబు తన కొడుకుతో దిగిన పాత ఫోటో షేర్ చేసి.. హ్యాపీ 19 మై సన్. ప్రతి సంవత్సరం నువ్వు నన్ను ఇంకా ఎక్కువగా ఆశ్చర్యపరుస్తున్నావు. ఈ సంవత్సరం నేను నీ పుట్టిన రోజుని మిస్ అవుతున్నాను. ఇన్నేళ్ళలో నేను మిస్ అయింది ఇదే. నీ ప్రతి అడుగులో నా ప్రేమ ఉంటుంది. నువ్వేం చేసినా ఎప్పుడూ నేను నీకు సపోర్ట్ ఉంటాను. నువ్వు ఇంకా ప్రకాశించాలి, ఎదగాలి అంటూ పోస్ట్ చేసాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.
Also Read : Nani : ఒక రిసెప్షనిస్ట్ చేసిన తప్పు వల్ల ‘నాని’ పేరే మారిపోయిందిగా.. పాపం.. ఇప్పటికీ అలాగే..
ఈ సంవత్సరంతో గౌతమ్ కి 19 ఏళ్ళు వచ్చాయని, రాజమౌళి షూటింగ్ వల్లే మహేష్ మొదటిసారి తన కొడుకు పుట్టిన రోజుకి దూరంగా ఉన్నాడని తెలిపాడు మహేష్. ఇక గౌతమ్ ప్రస్తుతం అమెరికాలో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడు.