Nani : ఒక రిసెప్షనిస్ట్ చేసిన తప్పు వల్ల ‘నాని’ పేరే మారిపోయిందిగా.. పాపం.. ఇప్పటికీ అలాగే..
తాజాగా నాని జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకి గెస్ట్ గా రావడంతో ఈ షోలో అనేక ఆసక్తికర అంశాలు తెలిపారు.(Nani)

nani
Nani : న్యాచురల్ స్టార్ నాని.. ఎలాంటి సపోర్ట్ లేకుండా సినీ పరిశ్రమలో స్టార్ గా ఎదిగిన హీరోల్లో ఒకరు. ఇప్పుడు వరుస హిట్స్ సాధిస్తూ వంద కోట్ల సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
తాజాగా నాని జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకి గెస్ట్ గా రావడంతో ఈ షోలో అనేక ఆసక్తికర అంశాలు తెలిపారు. అయితే నాని అసలు పేరు నవీన్ కుమార్ అని తెలిసిందే. అది కాకుండా నవీన్ బాబు అని కూడా ఉంది. తన పేరు మార్పు గురించి నాని ఈ షోలో ఆసక్తికర విషయం తెలిపాడు.
Also Read : Manchu Manoj Sadha : 21 ఏళ్ళ తర్వాత ఒకే స్టేజిపై ‘దొంగ దొంగది’.. అస్సలు మారలేదు.. ప్రోమో వైరల్..
నాని మాట్లాడుతూ.. సిద్దార్థ స్కూల్ లో 8వ తరగతి చదువుతున్నప్పుడు అల్లరి ఎక్కువైందని టీసీ ఇచ్చి పంపించేశారు. అప్పుడు టీసీ లో రాసేటప్పుడు అక్కడ రిసెప్షనిస్ట్ తండ్రి పేరు రాంబాబు అయితే కొడుకు పేరు ఉత్త నవీన్ ఎందుకు ఉంటుంది అని నవీన్ కి బాబు యాడ్ చేసింది. దాంతో ఆ టీసీ లో ఉన్నట్టే నవీన్ బాబు అని స్కూల్, కాలేజీలో పేరు అన్ని చోట్ల పడి అఫీషియల్ అయిపోయింది. పాస్ పోర్ట్ తో సహా అన్ని చోట్ల ఆ పేరే ఉంటుంది.
నా అసలు పేరు అయితే నవీన్ కుమార్. కానీ చిన్నప్పుడు నాని అనే పిలిచేవాళ్ళు ఇంట్లో. స్కూల్ లో ఫ్రెండ్స్ కూడా అలాగే పిలిచేవాళ్ళు. నాని అనే పేరుకు నేను కనెక్ట్ అయినట్టు నవీన్ కి కనెక్ట్ అవ్వలేదు. సినిమాల్లోకి వచ్చాక నాని మరింత కలిసొచ్చింది అని తెలిపాడు.