Manchu Manoj Sadha : 21 ఏళ్ళ తర్వాత ఒకే స్టేజిపై ‘దొంగ దొంగది’.. అస్సలు మారలేదు.. ప్రోమో వైరల్..
మంచు మనోజ్, సదా కలిసి దొంగ దొంగది సినిమా చేసిన సంగతి తెలిసిందే. గం గం గణేశా ఈవెంట్ లో మనోజ్ - సదా వచ్చి అలరించారు. (Manchu Manoj Sadha)

Manchu Manoj Sadha
Manchu Manoj Sadha : మంచు మనోజ్ ఇటీవల రీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మనోజ్ జీ తెలుగులో చేసిన వినాయక చవితి స్పెషల్ ఈవెంట్ కి హాజరయ్యాడు. అయితే ఈ ఈవెంట్ కి హీరోయిన్ సదా కూడా వచ్చింది. సదా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నా టీవీ షోలు, సోషల్ మీడియాతో యాక్టివ్ గానే ఉంది. గతంలో మంచు మనోజ్ – సదా ఇద్దరూ కలిసి దొంగ దొంగది సినిమా చేసిన సంగతి తెలిసిందే.(Manchu Manoj Sadha)
2004 లో వచ్చిన దొంగ దొంగది సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. ఒకరంటే ఒకరికి పడకుండా తర్వాత లవ్ చేసుకునే పాత్రల్లో మనోజ్ – సదా ఫుల్ కామెడీ పండించారు. ఈ ఇద్దరూ గతంలో పలు ఈవెంట్స్ కి విడివిడిగా హాజరయినా ఇన్నేళ్ల తర్వాత మొదటిసారి ఒకే వేదికపై కలిసి కనిపించారు.
గం గం గణేశా ఈవెంట్ లో మనోజ్ – సదా వచ్చి అలరించారు. ఇద్దరూ పోటాపోటీగా పంచులేస్తూ అల్లరి చేస్తూ అలరించారు. ఈ షోలో పెట్టిన గేమ్స్ ఆడి మెప్పించారు. ఒకర్నొకరు హత్తుకొని అప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు. దీంతో ఈ ఈవెంట్ ప్రోమో వైరల్ గా మారింది. ఫుల్ ఎపిసోడ్ నేడు ఆదివారం జీ తెలుగు ఛానల్ లో సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ కానుంది.
మంచు మనోజ్ – సదా వచ్చి అలరించిన ఈవెంట్ ప్రోమో మీరు కూడా చూసేయండి..