Police Stories : అందరూ మళ్ళీ పోలీస్ పాత్రలపైనే పడ్డారుగా.. నాని టు ప్రభాస్..

ఖాకీడ్రెస్ లో ఉండే ఎలివేషనే వేరు. అందుకే హీరోలందరూ ఒక్కసారైనా పోలీస్ క్యారెక్టర్ చెయ్యాలనుకుంటారు.

Nani Prabhas Raviteja Vijay Deverakonda so Many Heros Doing Police Stories

Police Stories : హీరోయిజం చూపించాలంటే పోలీస్ క్యారెక్టర్ తర్వాతే ఏదైనా. ఎంత మాస్ చూపించినా అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు కానీ పోలీస్ క్యారెక్టర్ లో ఎమోషన్ ఉంటుంది, మాస్ ఉంటుంది కాబట్టి అందరూ ఓన్ చేసుకుంటారు. అందుకే పెద్ద హీరోల దగ్గరనుంచి చిన్న హీరోల వరకూ కాప్ స్టోరీస్ మీద మనసు పారేసుకుంటున్నారు. ఒకప్పుడు పోలీస్ స్టోరీలు ఎక్కువగా వచ్చాయి. మధ్యలో గ్యాప్ రాగా ఇప్పుడు మళ్ళీ చాలా మంది హీరోలు ఈ పోలీస్ కథలతోనే వస్తున్నారు. ఖాకీడ్రెస్ లో ఉండే ఎలివేషనే వేరు. అందుకే హీరోలందరూ ఒక్కసారైనా పోలీస్ క్యారెక్టర్ చెయ్యాలనుకుంటారు.

ఈ లిస్ట్ లోకి ప్రభాస్ యాడ్ అయ్యారు. ప్రభాస్, సందీప్ రెడ్డి కాంబినేషన్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న స్పిరిట్ మూవీలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో కనిపించబోతున్నారని అఫీషియల్ గా అనౌన్స్ చేసేశారు సందీప్ రెడ్డి. ప్రభాస్ కెరీర్ లో ఇప్పటి వరకూ పోలీస్ రోల్ చెయ్యలేదు. అందుకే స్పిరిట్ మూవీ లో ప్రభాస్ పోలీస్ లుక్ లో ఎలా ఉండబోతున్నారో అంటూ క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు ఫాన్స్.

Also Read : Jagamerigina Satyam : ‘జగమెరిగిన సత్యం’ మూవీ రివ్యూ.. రవితేజ మేనల్లుడు మొదటి సినిమా ఎలా ఉంది..?

కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ అన్నీ పోలీస్ క్యారెక్టర్ తో చేసిన సినిమాలే. అందుకే రవితేజ కాప్ స్టోరీస్ చెయ్యడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటారు. మరోసారి మాస్ జాతర సినిమాలో తనుకు బాగా కలిసొచ్చిన పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించబోతున్నారు. భాను భోగవరపు డైరెక్షన్లో రవితేజ, శ్రీలీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న మాస్ జాతర మరోసారి రవితేజ కి హిట్ ఇస్తుందో లేదో చూడాలి. ఎందుకంటే అసలే వరస ఫ్లాపులతో ట్రాక్ తప్పిన రవితేజ ఈసారి హిట్ ట్రాక్ ఎక్కుతారని ఎదురుచూస్తున్నారు.

పక్కింటి అబ్బాయిలా సింపుల్ గా ఉన్న నాని కూడా ఈ సారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నారు. జస్ట్ ఫర్ ఎ ఛేంజ్ ఈసారి వయెలెన్స్ రేంజ్ పెంచి మరీ హిట్ 3 లో అర్జున్ సర్కార్ గా కనిపిస్తున్నారు. నాని ఇప్పటి వరకూ చేసిన సినిమాలకు కంప్లీట్ డిఫరెంట్ గా హిట్ 3 రాబోతోంది. ఈ రీజన్ తో పాటు నాని పోలీస్ రోల్ చెయ్యడం ఆడియన్స్ కి ఇంట్రస్టింగ్ ఫ్యాక్టర్ గా మారిపోయింది. సాఫ్ట్ అండ్ లవబుల్ క్యారెక్టర్స్ నుంచి రూత్ లెస్ యాక్షన్ కాప్ గా మారిపోయిన నాని హిట్ 3 మే 1న రిలీజ్ కానుంది.

Also Read : Retro : సూర్య ‘రెట్రో’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది..

రౌడీ హీరోగా, మాస్ లుక్ తో ఇప్పటి వరకూ క్యారెక్టర్లు చేసిన విజయ్ దేవరకొండ సక్సెస్ రూట్లోకి వెళ్లాలంటే కాప్ స్టోరీయే బెస్ట్ అనుకున్నారు. అందుకే గౌతమ్ తిన్ననూరితో చేస్తున్న కింగ్ డమ్ లో స్పై గా కనిపిస్తున్నారు. పవర్ ఫుల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న కింగ్ డమ్ మూవీ లో హెవీ ఎమోషన్స్ ఉన్న కాప్ రోల్ ప్లే చేస్తున్నారట విజయ్. రిలీజైన గ్లింప్స్ లో విజయ్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించారు. ఈ కాప్ డ్రామా మే 30న రిలీజ్ అవ్వబోతుంది.

విశ్వక్ సేన్ కూడా పోలీస్ రోల్ లో ఓ సినిమా అనౌన్స్ చేశారు. మాస్ హీరోగా ఉన్న ఇమేజ్ ని కంప్లీట్ గా మార్చేసుకోవడానికి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మరోసారి ఆడియన్స్ ముందుకొస్తున్నారు విశ్వక్. ఈ మాస్ హీరో కెరీర్ లో హిట్ మూవీలో పోలీస్ రోల్ చేసి హిట్ అందుకున్నాక మళ్లీ గ్యాప్ తర్వాత శ్రీధర్ గంటా డైరెక్షన్లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా తన 13వ సినిమా ప్లాన్ చేసుకున్నారు. ఇలా ఇప్పుడు హీరోలంతా మళ్ళీ పోలీస్ పాత్రల వెనక పడుతున్నారు.