Jagamerigina Satyam : ‘జగమెరిగిన సత్యం’ మూవీ రివ్యూ.. రవితేజ మేనల్లుడు మొదటి సినిమా ఎలా ఉంది..?
రవితేజ మేనల్లుడు అవినాష్ వర్మ ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.

Raviteja Son in Law Avinash Varma Jagamerigina Satyam Movie Review
Jagamerigina Satyam : అవినాష్ వర్మ, ఆద్య రెడ్డి, నీలిమ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన సినిమా ‘జగమెరిగిన సత్యం’. అమృత సత్యనారాయణ క్రియేషన్స్ బ్యానర్ పై విజయ్ భాస్కర్ నిర్మాణంలో తిరుపతి పాలే దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. జగమెరిగిన సత్యం నేడు ఏప్రిల్ 18 థియేటర్స్ లో రిలీజయింది.
కథ విషయానికొస్తే.. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండే ఓ చిన్న పల్లెటూరు దింద. చిన్నప్పుడు తన మామ ఊరు దిందకి వెళ్లినప్పుడు అక్కడుండే సత్యం(అవినాష్ వర్మ)ని చూసి ప్రేమలో పడుతుంది సరిత(ఆద్య). పెద్దయ్యాక వెళ్ళినప్పుడు కూడా వేళ్ళు ప్రేమించుకుంటారు. సత్యం, సరిత ఏకాంతంగా కలిసినప్పుడు సత్యం చిన్నమ్మ చూడటంతో అది పెద్ద గొడవగా మారుతుంది. వీరి ప్రేమకు ఊర్లోని కులాలు, రాజకీయాలు అడ్డు వస్తాయి. ఈ గొడవలతో సత్యం మీద ఓ హత్య కేసు పడుతుంది. సత్యం ఆ కేసు నుంచి బయటపడ్డాడా? అసలు ఎవరు చనిపోయారు? ఆ హత్య ఎవరు చేశారు? సత్యం – సరితల ప్రేమకథ ఏమైంది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Retro : సూర్య ‘రెట్రో’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది..
సినిమా విశ్లేషణ.. రవితేజ మేనల్లుడు అవినాష్ వర్మ ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. సినిమా రిలీజ్ ముందు రవితేజ ఈ సినిమా గురించి తన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది.
జగమెరిగిన సత్యం పూర్తిగా తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. ఓ చిన్న పల్లెటూరు, చుట్టూ పొలాలు రియల్ లొకేషన్స్ లో తెరకెక్కించడంతో ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. చిన్నప్పట్నుంచి పెరిగి పెద్దవైన లవ్ స్టోరీలు వాటికి ఎవరో ఒకరు అడ్డు రావడం రెగ్యులర్ కథే అయినా తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ కొత్తగా తీసుకొని తెరకెక్కించారు. అక్కడక్కడా కాస్త సాగదీసినట్టు ఉంటుంది. హీరో – హీరోయిన్ ఇద్దరి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు బాగా రాసుకున్నారు. సెకండ్ హాఫ్ కాస్త ఎమోషనల్ గా సాగుతుంది. క్లైమాక్స్ లో కూడా ఎమోషన్ బాగానే వర్కౌట్ అయింది.
నటీనటుల పర్ఫార్మెన్స్.. అవినాష్ వర్మ మొదటి సినిమా అయినా బాగా నటించాడు. పల్లెటూరి యువకుడి పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఆద్య క్యూట్ గా లంగాఓణిలో పల్లెటూరి అమ్మాయిలా నటించి బాగా మెప్పించింది. నీలిమ కూడా తన నటనతో ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. సినిమా అంతా పల్లెటూరులో తీయడంతో విజువల్స్ అందంగా పచ్చదనంగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. పాటలు ఓకే అనిపిస్తాయి. రెగ్యులర్ కథే అయినా డైరెక్టర్ తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో కొత్తగా చూపించే ప్రయత్నం చేసాడు. నిర్మాణ పరంగా సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు.
మొత్తంగా ‘జగమెరిగిన సత్యం’ సినిమా ఓ తెలంగాణ విలేజ్ ప్రేమకథకు అడ్డొచ్చిన సంఘటనలతో తెరకెక్కించారు. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.