Shyam Singha Roy : నాలుగు భాషల్లో నాని సినిమా

నేచురల్ స్టార్ నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ రిలీజ్ మూవీ ‘శ్యామ్‌ సింగ రాయ్‌’..

Shyam Singha Roy : నాలుగు భాషల్లో నాని సినిమా

Shyam Singha Roy

Updated On : October 18, 2021 / 11:28 AM IST

Shyam Singha Roy: నేచురల్‌ స్టార్‌ నాని కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సినిమా ‘శ్యామ్‌ సింగ రాయ్‌’. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్‌ కథానాయికలు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద ప్రొడక్షన్‌ నెం.1గా ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్‌ సంక్రిత్యాన్‌ దర్శకత్వంలో, వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్నారు.

Shyam Singha Roy : ఈసారి థియేటర్లలోనే..

ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉంది. మొన్న ఈ సినిమాలో నాని చేస్తున్న వాసు క్యారెక్టర్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. నాని డిఫరెంట్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు.

Chiranjeevi : కుడి చేతికి సర్జరీ చేశారు.. అభిమానులు ఆందోళన చెందకండి..

సోమవారం రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌ 24 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ చిత్రాన్ని విడుదల చెయ్యనున్నట్లు తెలియజేస్తూ పోస్టర్లు వదిలారు.

Ajay Bhupathi : యాటిట్యూడ్ మార్చుకో.. లేదంటే ఇండస్ట్రీలో ఉండవ్..

నాని కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్ రిలీజ్. నేచురల్ స్టార్ నటించిన గత రెండు సినిమాలు ‘వి’, ‘టక్ జగదీష్’ ఓటీటీలో విడుదలయ్యాయి. కొంత గ్యాప్ తర్వాత ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ తో థియేటర్లలో అదికూడా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతుండడడం విశేషం.

Akhil Akkineni : ‘టక్కరిదొంగ’ సెట్‌లో ‘సిసింద్రీ’

ఈ చిత్రానికి సత్యదేవ్‌ జంగా కథ అందించారు. మెలోడీ స్పెషలిస్ట్‌ మిక్కీ జే మేయర్‌ సంగీతం అందిస్తున్నారు. శాను జాన్‌ వర్గీస్‌ సినిమాటోగ్రాఫర్‌గా, నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌ నవీన్ నూలి ఈ సినిమాకు ఎడిటర్‌గా వర్క్‌ చేస్తున్నారు.