Akhil Akkineni : ‘టక్కరిదొంగ’ సెట్‌లో ‘సిసింద్రీ’

మహేష్ బాబు ‘టక్కరిదొంగ’ సెట్‌లో అఖిల్, కౌబాయ్ హ్యాట్ పెట్టుకుని, చేతిలో గన్ పట్టుకుని ఉన్న పిక్ భలే క్యూట్‌గా ఉంది..

Akhil Akkineni : ‘టక్కరిదొంగ’ సెట్‌లో ‘సిసింద్రీ’

Akhil Akkineni

Updated On : October 17, 2021 / 3:58 PM IST

Akhil Akkineni: అక్కినేని ఫ్యామిలీ నుండి థర్డ్ జెనరేషన్ హీరోగా చిన్నప్పుడే ‘సిసింద్రీ’ సినిమాతో తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు అఖిల్ అక్కినేని. ‘మనం’ మూవీ క్లైమాక్స్‌లో ఎంట్రీ ఇవ్వగానే.. కుర్రాడి కటౌట్ అదిరింది.. హీరో అయితే బాక్సాఫీస్ షేకే అనుకున్నారంతా.

Most Eligible Bachelor : ఫస్ట్‌డే అయ్యగారు ఎంత వసూలు చేశారంటే

‘అఖిల్’ తో హీరోగా ఇంట్రడ్యూస్ అయిన అఖిల్ ఫస్ట్ సినిమాకే డ్యాన్సులు, ఫైట్స్ బాగానే చేస్తున్నాడనే పేరు తెచ్చుకున్నాడు. తర్వాత చేసిన ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’ సినిమాలు యావరేజ్‌గా ఆడాయి కానీ అఖిల్‌కి హిట్ మాత్రం పడలేదు.

AHA : ‘ఆహా’లో ‘లవ్ స్టోరీ’.. డిటిటల్ ట్రైలర్ చూశారా

కట్ చేస్తే.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ తో ఫస్ట్ హిట్ కొట్టాడు. లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలోకొచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే రీసెంట్‌గా అఖిల్ చిన్నప్పటి ఫొటో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

SPIRIT: క్రేజీ కాంబో.. డార్లింగ్‌తో బెబో

మహేష్ బాబు ‘టక్కరిదొంగ’ సెట్‌లో అఖిల్, కౌబాయ్ హ్యాట్ పెట్టుకుని, చేతిలో గన్ పట్టుకుని ఉన్న పిక్ భలే క్యూట్‌గా ఉంది. అఖిల్ భలే ముద్దుగా ఉన్నాడంటూ నెటిజన్లు, అక్కినేని అభిమానులు ఈ ఫొటోను తెగ షేర్ చేసేస్తున్నారు. ప్రస్తుతం స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమా చేస్తున్నాడు అఖిల్.

Jai Bhajarangi : ‘కె.జి.యఫ్’ రేంజ్‌లో శివన్న ‘జై భజరంగి’