SPIRIT: క్రేజీ కాంబో.. డార్లింగ్‌తో బెబో

సైఫ్ అలీ ఖాన్ తర్వాత కరీనా కపూర్, ప్రభాస్‌తో నటించనుందనే వార్త వైరల్ అవుతోంది..

SPIRIT: క్రేజీ కాంబో.. డార్లింగ్‌తో బెబో

Kareena Kapoor

SPIRIT: రెబల్ స్టార్ ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా.. సాలిడ్ కాంబినేషన్ కుదిరింది. పాన్ ఇండియా స్టార్, పాన్ ఇండియన్ డైరెక్టర్‌ల కలయికలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టింది టీ-సిరీస్ సంస్థ. ప్రభాస్ కెరీర్‌లో 25వ సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి.

Keerthy Suresh : హ్యాపీ బర్త్‌డే కీర్తి సురేష్

పాన్ ఇండియన్ స్థాయిలో భారీ బడ్జెట్‌తో టీ-సిరీస్, భ‌ద్ర‌కాళీ పిక్చ‌ర్స్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటినుండి సోషల్ మీడియాలో రోజుకో కొత్త వార్త వైరల్ అవుతోంది. డార్లింగ్ ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్‌ క్యారెక్టర్ చెయ్యనున్నారని అంటున్నారు.

AHA : ‘ఆహా’లో ‘లవ్ స్టోరీ’.. డిటిటల్ ట్రైలర్ చూశారా

అలాగే ఈ మూవీకి గానూ ప్రభాస్ దాదాపు 150 కోట్లు పారితోషికంగా తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ హైలెట్ అని, అందులోనూ అది లేడీ విలన్ రోల్ అని ఆ పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్‌ని అనుకుంటున్నారని నెట్టింట క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.

Prabhas : ప్రభాస్ బిర్యానీకి బాలీవుడ్ భామ ఫిదా..

కరీనా భర్త సైఫ్ అలీ ఖాన్, ప్రభాస్ ‘ఆదిపురుష్’ లో లంకేశ్వరుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ కపుల్‌కి డార్లింగ్ మాంచి టేస్టీ బిర్యానీ పంపగా.. ఆ పిక్స్ షేర్ చేస్తూ.. ‘ప్రభాస్ బిర్యానీ అదుర్స్’ అంటూ బెబో పోస్ట్ చేశారు. సైఫ్ తర్వాత కరీనా కూడా ప్రభాస్‌కి విలన్‌గా మారనుందంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు.

Prabhas : ప్రభాస్ వ్యానిటీ వ్యాన్ చూశారా..