Nani Son : నాని కొడుక్కి కాలు ఫ్రాక్చర్.. జున్ను అర్ధరాత్రి పూట ఆ మాట అనేసరికి.. నాని ఎమోషనల్..

నాని జగపతి బాబు జయమ్ము నిశ్చయమ్మురా షోకి హాజరవ్వగా ఈ షోలో అనేక ఆసక్తికర విషయాలు తెలిపాడు.(Nani Son)

Nani Son

Nani Son : నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. సినిమాలే కాకుండా తన ఫ్యామిలీ గురించి కూడా రెగ్యులర్ గా నాని తన సోషల్ మీడియాలో పంచుకుంటాడు. ముఖ్యంగా తన కొడుకు అర్జున్ కి సంబంధించిన క్యూట్ మూమెంట్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు.(Nani Son)

తాజాగా నాని జగపతి బాబు జయమ్ము నిశ్చయమ్మురా షోకి హాజరవ్వగా ఈ షోలో అనేక ఆసక్తికర విషయాలు తెలిపాడు. ఈ క్రమంలో జగపతి బాబు మీ అబ్బాయికి కాలు ఫ్రాక్చర్ అయింది కదా అని అడిగారు.

Also Read : The Paradise : నాని పాన్ ఇండియా కాదు.. ఏకంగా పాన్ వరల్డ్.. ప్లాన్ అదిరిందిగా..

దానికి నాని సమాధానమిస్తూ.. సంవత్సరం క్రితం జున్ను కాలికి ఫ్రాక్చర్ అయింది. పిల్లలకు దెబ్బ తగిలినా, హెల్త్ బాగోలేకపోయినా చాలా బాధ అనిపిస్తుంది. ఆ సమయంలో వాళ్ళ ఫేస్ చూడలేము. సైకిల్ మీద నుంచి పడి బోన్ ఫ్రాక్చర్ అయింది. కదలడానికి కూడా లేదు. కాలు కొంచెం జరిపినా నొప్పి అనేవాడు. బాత్రూం కి మేమే తీసుకెళ్ళేవాళ్ళం. నాకు, అంజుకి కొన్ని రోజులు నిద్ర లేదు. అర్ధరాత్రి పూట పెయిన్ అని ఏడ్చేవాడు. ఒకరోజు రాత్రి పూట సడెన్ గా లేచి సారీ నాన్న అన్నాడు. ఎందుకురా అంటే.. నా వల్ల మీ అందరికి నిద్ర ఉండట్లేదు అని అనేసరికి అంత చిన్న పిల్లాడు అంత పెద్ద మాట అనేసరికి జళ్ళుమంది అంటూ ఎమోషనల్ అయ్యాడు.

Also Read : Nivetha Pethuraj : రేస్ ట్రాక్ లో పరిచయం అయి పెళ్లి వరకు.. పెళ్లి, నిశ్చితార్థం ఎప్పుడో చెప్పేసిన హీరోయిన్..