Nivetha Pethuraj : రేస్ ట్రాక్ లో పరిచయం అయి పెళ్లి వరకు.. పెళ్లి, నిశ్చితార్థం ఎప్పుడో చెప్పేసిన హీరోయిన్..
నివేతా పేతురాజ్ కేవలం హీరోయిన్ మాత్రమే కాదు బ్యాడ్మింటన్ ఛాంపియన్, రేసర్ కూడా. తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. (Nivetha Pethuraj)

Nivetha Pethuraj
Nivetha Pethuraj : హీరోయిన్ నివేతా పేతురాజ్ కి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తెలుగు, తమిళ్ లో వరుసగా సినిమాలు చేసింది నివేతా. మెంటల్ మదిలో, చిత్రలహరి, దాస్ కా ధమ్కీ, రెడ్, పాగల్, అల వైకుంఠపురంలో.. ఇలా చాలా సినిమాలతో తెలుగులో డైరెక్ట్ గానే నటించి మెప్పించింది. ప్రస్తుతం నివేతా సినిమాలు, సిరీస్ లు అడపాదడపా చేస్తుంది.(Nivetha Pethuraj)
నివేతా పేతురాజ్ కేవలం హీరోయిన్ మాత్రమే కాదు బ్యాడ్మింటన్ ఛాంపియన్, రేసర్ కూడా. ఇటీవలే నివేతా పేతురాజ్ రాజ్ హిత్ ఇబ్రాన్ అనే బిజినెస్ మెన్ ని పెళ్లి చేసుకోబోతున్నట్టు అతన్ని పరిచయం చేస్తూ వాళ్ళు క్లోజ్ గా దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
Also See : Nivetha Pethuraj : హీరోయిన్ నివేతా పేతురాజ్ పెళ్లి చేసుకునేది ఇతన్నే.. ఫొటోలు..
తాజాగా తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేమ గురించి చెప్తూ పెళ్లి గురించి మాట్లాడింది. నివేతా పేతురాజ్ మాట్లాడుతూ.. రాజ్ హిత్ అయిదేళ్ల క్రితం దుబాయ్ లో పరిచయం అయ్యాడు. అక్కడ రేస్ ట్రాక్ లో పరిచయం అయ్యాడు. మొదట ఫ్రెండ్స్ అయ్యాం. ఆ తర్వాత ప్రేమించుకున్నాం. అక్టోబర్ లో నిశ్చితార్థం చేసుకుంటున్నాం. 2026 జనవరిలో పెళ్లి ఉంటుంది అని తెలిపింది.