The Paradise : నాని పాన్ ఇండియా కాదు.. ఏకంగా పాన్ వరల్డ్.. ప్లాన్ అదిరిందిగా..
తాజా టాలీవుడ్ సమాచారం ప్రకారం ది ప్యారడైజ్ టీం హాలీవుడ్ లో కొలాబరేషన్ కోసం చర్చలు జరుపుతున్నారు.(The Paradise)

The Paradise
The Paradise : ఎలాంటి సపోర్ట్ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చి స్టార్ గా ఎదిగిన నాని ఇప్పుడు వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. ఇటీవల హిట్ 3 తో సక్సెస్ కొట్టిన నాని త్వరలో ది ప్యారడైజ్ సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్స్, నాని లుక్స్ తో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. SLVC బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ భారీగా తెరకెక్కుతుంది. (The Paradise)
తాజా టాలీవుడ్ సమాచారం ప్రకారం ది ప్యారడైజ్ టీం హాలీవుడ్ లో కొలాబరేషన్ కోసం చర్చలు జరుపుతున్నారు. ఈ సినిమాని ఆల్రెడీ పాన్ ఇండియా రిలీజ్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ సినిమాలా ప్లాన్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ వెర్షన్లను కూడా రెడీ చేయడానికి హాలీవుడ్ టీమ్ తో చర్చలు జరుపుతున్నారు.
Also Read : Nivetha Pethuraj : రేస్ ట్రాక్ లో పరిచయం అయి పెళ్లి వరకు.. పెళ్లి, నిశ్చితార్థం ఎప్పుడో చెప్పేసిన హీరోయిన్..
అలాగే ఇండియాలో భారీ సంఖ్యలో పాలోవర్స్ ఉన్న ఓ హాలీవుడ్ నటుడిని తీసుకురావడానికి కూడా ప్యారడైజ్ టీం సంప్రదింపులు చేస్తుంది. ఈ సినిమాతో బాలీవుడ్ నటుడు రాఘవ్ జూయాల్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో నాని సినిమాని వరల్డ్ వైడ్ రిలీజ్ అని టాక్ రావడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ది ప్యారడైజ్ సినిమా 2026 మార్చి 26న థియేటర్లలోకి రానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం తో పాటు బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ మొత్తం ఎనిమిది భాషల్లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.