Nani Tells about his Relation with Chiranjeevi and his Movie with Megastar under Srikanth Odela Direction
Nani – Chiranjeevi : నాని – చిరంజీవికి మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు నానిని చిరంజీవి ఇంటికి పిలిచి మరీ అభినందించారు. ఇటీవల నాని నిర్మించిన కోర్ట్ సినిమా హిట్ అయితే ఆ సినిమా టీమ్ ని కూడా పిలిచి మెచ్చుకున్నారు మెగాస్టార్. నాని నిర్మాణంలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే.
నాని మే 1న హిట్ 3 సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాని తనకు చిరంజీవితో ఉన్న అనుబంధం గురించి, చిరంజీవితో తీయబోయే సినిమా గురించి తెలిపాడు.
Also Read : Karthik Subbaraj : ‘గేమ్ ఛేంజర్’ పై డైరెక్టర్ కామెంట్స్ వైరల్.. నేనిచ్చిన కథని మార్చేశారు..
నాని మాట్లాడుతూ.. ఆయన నాకు చాలా సార్లు ఫోన్ చేశారు. జున్ను పుట్టినప్పుడు కూడా ఫోన్ చేసారు. సైకిల్ ఒకటి గిఫ్ట్ గా పంపించారు. అది నా ఆఫీస్ లో ఉంటుంది. ఒక అవార్డు లాగా పెట్టుకున్నాను ఆ సైకిల్ ని. ఎప్పటికప్పుడు ఫోన్ చేసి విషెష్ చేస్తారు. డియర్ నాని అని నా ప్రతి సినిమా తర్వాత మెసేజెస్ పెడతారు. సినిమా గురించి నేను, శ్రీకాంత్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాము. ఇంట్లో బజ్జిలు చేయించారు. నేను ఏదో మాట్లాడదాం అనే లోపు బజ్జిలు తిను బాగుంటాయి అని అన్నారు. ఆయన ముందు కూర్చుని బజ్జిలు తినాలంటే కష్టంగా అనిపించింది. ఆయనేమో సూపర్ ఉంటాయి బజ్జిలు నువ్వు తినాల్సిందే అన్నారు.
అంతా ఓకే అయ్యాక మేము ఆల్రెడీ రిలీజ్ పోస్టర్ గురించి అనుకున్నాము. శ్రీకాంత్, చిరంజీవి గారి చెయ్యి కలిపి బ్లడ్ లో ముంచింది నేను ఫోటో తీసి పోస్ట్ చేస్తాను అని చెప్పాము. ఫేక్ బ్లడ్ తెప్పించాము. ఆ ఐడియా గురించి చెప్తే చిరంజీవి గారు ఎక్కడ్నుంచి వస్తాయి ఇలాంటి ఐడియాలు అన్నారు. అయితే శ్రీకాంత్ వైట్ షర్ట్ వేసుకొచ్చాడు. చిరంజీవి గారు అప్పుడు బ్లాక్ షర్ట్ లో ఉన్నారు. నేను సర్ ఏమనుకోకపోతే వైట్ షర్ట్ మార్చుకుంటారా అని అడగ్గానే ఓకే ప్రొడ్యూసర్ గారు అని అన్నారు. ఆయన ఆ మాట అనగానే ఓ నేను ప్రొడ్యూసర్ కదా అని ఫీల్ వచ్చింది. ప్యారడైజ్ సినిమా రిలీజ్ తర్వాతే చిరంజీవి సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే దాని గురించి ఏమి మాట్లాడలేము. ఆ సినిమాని చూసి అందరూ గర్వపడతారు అని తెలిపారు.
Also Read : Ram Nitin : వామ్మో.. సినిమా హిట్ అయిందని పది రోజులు తాగారంట.. దెబ్బకు ఆ డెసిషన్ తీసుకొని..