Ram Nitin : వామ్మో.. సినిమా హిట్ అయిందని పది రోజులు తాగారంట.. దెబ్బకు ఆ డెసిషన్ తీసుకొని..
తాజాగా ఓ నటుడు తమ సినిమా హిట్ అయిందని పది రోజులు తాగామని చెప్పుకొచ్చాడు.

Mad Fame Actor Ram Nitin Drinking Alcohol for Ten Days after Mad Hit with Sangeeth Shobhan
Ram Nitin : సాధారణంగా సినిమా హిట్ అయితే ప్రైవేట్ పార్టీలు కూడా చేసుకుంటారు మూవీ యూనిట్స్. చాలా మంది సెలబ్రిటీలు కూడా ఆల్కహాల్ తాగుతారు. తాజాగా ఓ నటుడు తమ సినిమా హిట్ అయిందని పది రోజులు తాగామని చెప్పుకొచ్చాడు.
నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన మ్యాడ్ సినిమా 2023లో రిలీజయి పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే మ్యాడ్ స్క్వేర్ అంటూ సీక్వెల్ కూడా వచ్చి హిట్ అయింది.
Also Read : Karthik Subbaraj : ‘గేమ్ ఛేంజర్’ పై డైరెక్టర్ కామెంట్స్ వైరల్.. నేనిచ్చిన కథని మార్చేశారు..
ఇందులో నటించిన రామ్ నితిన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మ్యాడ్ సినిమా హిట్ అయిన తర్వాత ఒక పది రోజులు డైలీ మందు తాగాం. మందు ఇంత బాగుంటదా అనిపించింది. ఒక రోజు సంగీత్, నేను ఫుల్ బాటిల్ తాగాము. అయిపోయిందా, ఎక్కిందా అని అడిగితే సంగీత్ సరిపోలేదు అన్నాడు. ఇంకేం కావాలి అనుకున్నా. సంగీత్ ఒక వోడ్కా బాటిల్ తీసుకొచ్చాడు. సగం తాగి వాంతు చేసుకున్నాం. అప్పుడు మేము డిసైడ్ అయ్యాము కేవలం సినిమా హిట్ కొట్టినప్పుడే మందు తాగాలి అని. మళ్లీ మ్యాడ్ స్క్వేర్ హిట్ అయిన తర్వాత పార్టీ చేసుకున్నాం అని తెలిపాడు.
Also Read : Guardian : హన్సిక సూపర్ హారర్ థ్రిల్లర్ సినిమా ‘గార్డియన్’.. ఇప్పుడు ఆహా ఓటీటీలో..