Nani Tells About Interesting Situation with Megastar Chiranjeevi
Nani – Chiranjeevi : న్యాచురల్ స్టార్ నాని కష్టపడి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగిన సంగతి తెలిసిందే. మరో పక్క నిర్మాతగా మారి ఎంతోమంది కొత్త దర్శకులకు, నటీనటులకు కూడా అవకాశాలు ఇస్తున్నాడు. నాని అంటే మంచి సినిమాలు చేస్తాడు, కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తాడు అని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు, ఇండస్ట్రీలో కూడా ఫిక్స్ అయ్యారు.
నాని నిర్మాణంలో ప్రియదర్శి మెయిన్ లీడ్ లో తెరకెక్కిన కోర్ట్ సినిమా మార్చ్ 14 రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాని మూవీ టీమ్ తో కలిసి ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి ఆసక్తికర విషయం చెప్పారు.
మొదట ప్రియదర్శి మాట్లాడుతూ.. నేను అన్నపూర్ణ స్టూడియోలో సినిమా ప్రమోషన్స్ చేస్తుంటే పక్కన విశ్వంభర షూటింగ్ చేస్తున్నారు. అలా చిరంజీవి గారికి కనిపించి వద్దామని వెళ్తే సినిమా గురించి అడిగారు. కోర్ట్ సినిమా చేస్తున్నా అంటే నాని కదా అయితే ఓకె. అయితే సినిమా బాగుంటుందిలే అన్నారు. నాని మీద చిరంజీవి సర్ కి అంత నమ్మకం అని అన్నారు.
నాని కూడా చిరంజీవి తనతో ఎలా ఉంటారో చెప్తూ.. నాగ చైతన్య పెళ్ళికి వెళ్తే నేను లోపలికి వెళ్తుంటే చిరంజీవి గారు బయటకు వస్తున్నారు. నన్ను చూసి ప్రొడ్యూసర్ గారు అని దండం పెట్టారు. ఎవరైనా పెద్ద నిర్మాత వచ్చారేమో అని నేను ఎవరా అని వెనక్కి తిరిగి చూస్తే ఎవరు లేరు. నేనా సార్ అంటూ ఒక్కసారి తడబడ్డాను. అవును ప్రొడ్యూసర్ గారు అని హగ్ ఇచ్చారు. ఆయన అంత బాగా మాట్లాడతారు అని అన్నారు. చిరంజీవి గారు అలా పిలవడం ఆయనకు చిన్న విషయం కావచ్చు. కానీ మెగాస్టార్ లాంటి వ్యక్తి మనల్ని అలా పిలవడం. మాట్లాడటం మనకు చాలా గొప్ప విషయం అని ప్రియదర్శి అన్నారు.
Also Read : Dilruba : కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబా’ నుంచి కేసీపీడీ వచ్చేసింది..
నాని నిర్మాతగా మారి వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల సినిమాకి కూడా నాని సమర్పకుడిగా ఉన్నారు. చిరు కూడా మొదటి నుంచి నానిని అభినందిస్తూనే వచ్చారు. తనలాగే కష్టపడి పైకి ఎదిగిన వ్యక్తి కావడంతో నానితో చాలా మంచి రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తారు మెగాస్టార్.