Divi : రవితేజ పక్కన హీరోయిన్ గా సెలెక్ట్.. రాత్రికి రాత్రే తీసేసారు.. వరుణ్ – లావణ్య సినిమాలో కూడా.. దివి వ్యాఖ్యలు..
తాజాగా దివి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.

Actress Divi Revealed he removed from Raviteja Movie
Divi : మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన దివి సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ బిగ్ బాస్ తో ఫేమ్ తెచ్చుకుంది. బిగ్ బాస్ తర్వాత దివి ఓ పక్క సోషల్ మీడియాలో మరింత పాపులర్ అవుతూనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా సినిమాలు, సిరీస్ లు చేస్తుంది. ఇటీవలే దివి పుష్ప 2, డాకు మహారాజ్ సినిమాలతో పలకరించింది. దివి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగానే ఉంది.
తాజాగా దివి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో తన గురించి అనేక విషయాలు తెలిపింది. ఈ క్రమంలో తనని పలు సినిమాల్లోంచి తీసేశారని కూడా చెప్పింది.
Also Read : Dilruba : కిరణ్ అబ్బవరం ‘దిల్ రూబా’ నుంచి కేసీపీడీ వచ్చేసింది..
దివి మాట్లాడుతూ.. నేను చాలా ఆడిషన్స్ ఇచ్చాను. ఛాన్స్ లు వచ్చినట్టే వచ్చి పోయాయి. పెద్ద సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, చిన్న సినిమాల్లో హీరోయిన్ గా చేద్దామనుకున్నాను. పెద్ద సినిమాల్లో హీరోయిన్ గా వస్తే మంచిదే. అంతరిక్షం సినిమాలో వరుణ్ తేజ్ పక్కన హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి ప్లేస్ కి నన్ను ఆడిషన్ చేసారు. ఆ పాత్ర వస్తుంది, అందులో నేనే హీరోయిన్ అనుకున్నా కానీ చివరకు లావణ్యని సెలెక్ట్ చేసారు. రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ ఉంటారు. ఆ ముగ్గురిలో నాకు కూడా ఒక రోల్ ఉంది. అంతా ఫిక్స్ అయిపొయింది. కానీ ఏమైందో రాత్రికి రాత్రే నన్ను తీసేసారు సినిమాలోంచి. నా పాత్రకు వేరే వాళ్ళను తీసుకున్నారు అని తెలిపింది. దీంతో దివి వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Also Read : Rashmika Mandanna : రష్మికకు బెదిరింపులు..? కొడవ కమ్యూనిటీ కౌన్సిల్ ఆరోపణలు.. సెక్యూరిటీ ఇవ్వాలి అంటూ..
రవితేజ టైగర్ నాగేశ్వర రావు సినిమాలో గాయత్రీ భరద్వాజ్, అనుకీర్తి వ్యాస్, నుపుర్ సనన్.. ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు. మరి ఈ ముగ్గురిలో దివిని ఏ పాత్రకి సెలెక్ట్ చేసి తీసేసారో.
View this post on Instagram