Rashmika Mandanna : రష్మికకు బెదిరింపులు..? కొడవ కమ్యూనిటీ కౌన్సిల్ ఆరోపణలు.. సెక్యూరిటీ ఇవ్వాలి అంటూ..
రష్మికకు భద్రతాపరమైన ఇబ్బందులు ఉన్నాయి, ఆమెకు బెదిరింపులు వస్తాయి అంటూ రష్మిక కమ్యూనిటీకి చెందిన కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు.

Kodava National Council demands security for Rashmika Mandanna
Rashmika Mandanna : రష్మిక మందన్న ఇటీవల రెగ్యులర్ గా కన్నడ వివాదాల్లో నిలుస్తుందని తెలిసిందే. గతంలో కూడా ఓ రెండు సార్లు కన్నడ ప్రేక్షకులు ఆమెను బహిష్కరించాలి అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేశారు. కొన్ని రోజుల క్రితం కూడా కర్ణాటకకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. కన్నడ అమ్మాయి రష్మిక ఇక్కడే తన కెరీర్ మొదలుపెట్టింది. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి హాజరు కావాలని అడిగినా ఆమె రావట్లేదు. కన్నడ భాష పట్ల, కన్నడ సినీ పరిశ్రమ పట్ల ఆమె అగౌరవంగా వ్యవహరిస్తోంది. ఆమెకు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉంది అని హెచ్చరించారు.
అదే రోజు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా సినిమా వాళ్లపై ఫైర్ అయ్యాడు. సినిమా వాళ్ళ తీరు మారకపోతే వాళ్ళను ఏ విధంగా సరిచేయాలి నాకు తెలుసు. సినిమా వాళ్లకు నట్లు, బోల్టులు బిగించాల్సిన అవసరం ఉంది అని అన్నారు. పలువురు నేతలు కూడా రష్మిక పై కామెంట్స్ చేసారు. కొంతమంది కన్నడ వాళ్ళు రష్మికని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీంతో రష్మికకు భద్రతాపరమైన ఇబ్బందులు ఉన్నాయి, ఆమెకు బెదిరింపులు వస్తాయి అంటూ రష్మిక కమ్యూనిటీకి చెందిన కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు.
రష్మిక కర్ణాటకలోని కొడవ కమ్యూనిటీకి చెందిన మహిళ. దీంతో కర్ణాటకలోని కొడవ నేషనల్ కౌన్సిల్ వాళ్ళు కర్ణాటక ప్రభుత్వానికి, యూనియన్ హోమ్ మినిష్టర్ కి లేఖ రాశారు. రష్మిక మందన్నకు బెదిరింపులు వచ్చే అవకాశం ఉంది. ఆమెని కొంతమంది బహిరంగంగానే బెదిరిస్తున్నారు. ఆమెకు సెక్యూరిటీ ఇవ్వాలి. ఆమెకు సంబంధం లేకపోయినా ఆమెని రాజకీయాల్లోకి లాగుతున్నారు అంటూ తెలిపారు.
కొడవ నేషనల్ కౌన్సిల్ ప్రసిడెంట్ నాచప్ప మాట్లాడుతూ.. ఆమె సక్సెస్ కి రాజకీయాలకు సంబంధం లేదు. ఆమెని మెంటల్ గా హెరాజ్ చేస్తున్నారు. పొలిటికల్ వివాదాల్లోకి ఆమెను లాగుతున్నారు. ఆమెకి ప్రాణభయం ఉంది. ఆమెకు సెక్యూరిటీ కల్పించాలి అని కోరారు. దీంతో కర్ణాటకలో ప్రస్తుతం రష్మిక – కొడవ నేషనల్ కౌన్సిల్ వైరల్ గా మారింది.
Also Read : Rekhachithram : ‘రేఖాచిత్రం’ మూవీ రివ్యూ.. 1985లో మమ్ముట్టి సినిమా షూటింగ్ లో మిస్ అయిన అమ్మాయి ఎవరు..?
దీనిపై కర్ణాటక హోమ్ మినిస్టర్ స్పందిస్తూ.. నాకు ఇప్పటివరకు అలాంటి లేఖ అందలేదు. ఒకవేళ వస్తే నేను దాన్ని చూస్తాను అని తెలిపారు. రష్మికపై బెదిరింపులు వస్తున్నాయి అని తెలియడంతో పలువురు ఫ్యాన్స్ ఆందోళన చెందగా పలువురు సోషల్ మీడియాలో ఆమెకు సపోర్టుగా పోస్టులు చేస్తున్నారు. మరి దీనిపై రష్మిక మందన్న స్పందిస్తుందా చూడాలి. ఇక రష్మిక ఇటీవలే పుష్ప 2, చావా సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ భారీ హిట్స్ కొట్టింది. ప్రస్తుతం సికిందర్, ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలతో బిజీగా ఉంది.