Rajamouli – Mahesh Babu : ఫ్యాన్స్ కి షాక్ ఇస్తున్న మహేష్ – రాజమౌళి మూవీ టీమ్.. ఒక్క వీడియో లీక్ అవ్వడంతో.. సెక్యూరిటీ కూడా..

ఒరిస్సా అడవుల్లో షూటింగ్ అవ్వడంతో ఇటీవల ఓ చిన్న వీడియో క్లిప్ లీక్ అయింది.

Rajamouli – Mahesh Babu : ఫ్యాన్స్ కి షాక్ ఇస్తున్న మహేష్ – రాజమౌళి మూవీ టీమ్.. ఒక్క వీడియో లీక్ అవ్వడంతో.. సెక్యూరిటీ కూడా..

Rajamouli Mahesh Babu Movie Team Serious Action on SSMB 29 Leaking Video

Updated On : March 10, 2025 / 4:02 PM IST

Rajamouli – Mahesh Babu : మహేష్ బాబు – రాజమౌళి సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాజమౌళి ఇవ్వట్లేదు. కానీ రాజమౌళి ఇప్పటికే పూజ కార్యక్రమం పూర్తి చేసి ఒక షెడ్యూల్ షూటింగ్ చేసి రెండో షెడ్యూల్ షూటింగ్ కి ఒరిస్సా వెళ్లారు. ఇన్నాళ్లు ఫోటోలు, వీడియోలు లీక్ అవ్వకపోయినా ఏదో ఒక మ్యాటర్ మాత్రం లీక్ అయ్యేది.

అయితే ఒరిస్సా అడవుల్లో షూటింగ్ అవ్వడంతో ఇటీవల ఓ చిన్న వీడియో క్లిప్ లీక్ అయింది. ఇందులో విలన్స్ మహేష్ బాబుని పట్టుకున్నట్టు ఉంది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే వెంటనే రాజమౌళి టీమ్ ఈ వీడియోని నియంత్రించడానికి సైబర్ సెక్యూరిటీ సహాయం తీసుకొని ఆ వీడియో పోస్ట్ చేసిన ఫ్యాన్స్, నెటిజన్ల అకౌంట్స్ బ్లాక్ చేసేస్తున్నారట. దీంతో ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు.

Also Read : Rekhachithram : ‘రేఖాచిత్రం’ మూవీ రివ్యూ.. 1985లో మమ్ముట్టి సినిమా షూటింగ్ లో మిస్ అయిన అమ్మాయి ఎవరు..?

రాక రాక ఎంతగానో ఎదురుచూస్తున్న మహేష్ సినిమా నుంచో ఒక చిన్న క్లిప్ లీకైంది అని ఫ్యాన్స్ సంతోషిస్తే SSMB29 టీమ్ మాత్రం గట్టిగానే సమాధానమిస్తుంది. సైలెంట్ గా ఆ వీడియో పోస్ట్ చేసిన సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని లేపేస్తుంది. ఇన్నాళ్లు ఇన్ డోర్ కాబట్టి ఎలాంటి లీక్స్ జరగలేదు. అవుట్ డోర్ వెళ్లడంతో ఫస్ట్ టైం వీడియో క్లిప్ లీక్ అయింది.

దీంతో రాజమౌళి టీమ్ సెక్యూరిటీని మరింత పెంచాలని చూస్తున్నారట. సినిమా నుంచి ఎలాంటి లీక్స్ అవ్వకూడదు అని ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీని మూడింతలు పెంచుతున్నారని తెలుస్తుంది. ఒరిస్సా అడవుల్లో భారీ సెక్యూరిటీ నడుమ మూవీ టీమ్ తప్ప ఎవరికీ ప్రవేశం లేకుండా దరిదాపుల్లో ఎవరూ ఫోన్స్ వాడకుండా సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు అని తెలుస్తుంది.

Also Read : Gopichand : గోపీచంద్ కొత్త సినిమా ఓపెనింగ్.. ఆ డైరెక్టర్ తో.. ఈ సారి హిట్ పక్కా..

ఈ వీడియో లీక్ చేసిన వాళ్ళని ఇప్పటికే పట్టుకున్నట్టు సమాచారం. మరోసారి మెహెష్ – రాజమౌళి సినిమా నుంచి ఇంకేమి లీక్ అవ్వకుండా రాజమౌళి టీమ్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా ఒరిస్సా అడవుల్లో షూటింగ్ జరుగుతుంది. మహేష్ బాబు – విలన్స్ మధ్య సీన్స్ షూట్ చేస్తున్నారట. ఇక్కడ ఆఫ్రికాలో ఉండే స్పెషల్ బాంబో చెట్లు సెట్స్ వేయిస్తున్నారని కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా జాన్ అబ్రహం, పృద్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.