Rekhachithram : ‘రేఖాచిత్రం’ మూవీ రివ్యూ.. 1985లో మమ్ముట్టి సినిమా షూటింగ్ లో మిస్ అయిన అమ్మాయి ఎవరు..?

మలయాళంలో ఇలాంటి మర్డర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ రెగ్యులర్ గా వచ్చి మెప్పిస్తాయని తెలిసిందే.

Rekhachithram : ‘రేఖాచిత్రం’ మూవీ రివ్యూ.. 1985లో మమ్ముట్టి సినిమా షూటింగ్ లో మిస్ అయిన అమ్మాయి ఎవరు..?

Asif Ali Anaswara Rajan Rekhachithram Movie Review

Updated On : March 10, 2025 / 3:37 PM IST

Rekhachithram Movie Review : అసిఫ్ అలీ, అనశ్వర రాజన్, మనోజ్ కే జయన్, సిద్దిఖ్.. పలువురు కీలక పాత్రల్లో మలయాళంలో తెరకెక్కిన సినిమా రేఖా చిత్రం. జోఫీన్ టి చాకో దర్శకత్వంలో వేణు కున్నప్పిళ్లై నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 9న మలయాళంలో థియేటర్స్ లో రిలీజయింది. ఇటీవల మార్చ్ 7 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మార్చ్ 14 నుంచి ఆహా తెలుగు ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవ్వనుంది.

కథ విషయానికొస్తే.. వివేక్(అసిఫ్ అలీ) ఓ సస్పెండెడ్ పోలీస్. ఎలాగోలా తనకి తిరిగి జాబ్ వచ్చినా దూరంగా మలక్కపారా అనే ఓ విలేజ్ లో అతనికి పోస్టింగ్ వేస్తారు. అతను జాబ్ లో జాయిన్ అయిన రోజే ఆ ఊరి శివార్లలో రాజేంద్రన్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకుంటాడు. అతను సూసైడ్ చేసుకునే ముందు ఫేస్ బుక్ లైవ్ లో.. తను, ఇంకో నలుగురు కలిసి 1985 లో ఓ అమ్మాయిని ఇక్కడే పూడ్చిపెట్టాం అని చెప్పి తనతో పాటు ఫ్రాన్సిస్, విన్సెంట్ ఉన్నారు అని చెప్పి ఒకరి పేరు చెప్పడు. దీంతో ఈ లైవ్ సంచలనంగా మారడంతో కేసు వివేక్ చేతికి వస్తుంది.

అక్కడ తవ్వగా ఓ అమ్మాయి అస్థిపంజరం బయటపడుతుంది. దాంతో పెద్ద బిజినెస్ మెన్ అయిన విన్సెంట్(మనోజ్ కె జయన్)ని విచారణకు పిలుస్తారు. వివేక్ ఈ కేసుని సీరియస్ గా తీసుకొని ఆ అస్థిపంజరం రేఖ అనే అమ్మాయిది అని, 1985 మమ్ముట్టి కాతోడు కాథోరమ్ షూటింగ్ నుంచి మిస్ అయిన అమ్మాయి అని కనిపెడతాడు. ఇంతలో ఈ కేసుకు సంబంధించిన వాళ్ళు మరికొంతమంది చనిపోవడం, వివేక్ ని ఈ కేసు నుంచి తప్పించడం చేస్తారు. మరి వివేక్ ఈ కేసుని సాల్వ్ చేస్తాడా? అసలు రేఖ ఎవరు? ఆమెని ఎందుకు చంపారు? రాజేంద్రన్ ఒకరి పేరు ఎందుకు చెప్పలేదు? ఆ నలుగురిలో విన్సెంట్ ఒకరు అని ఎలా ప్రూవ్ చేసారు? మమ్ముట్టి షూటింగ్ నుంచి రేఖ ఎందుకు మిస్ అయింది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Also Read : Gopichand : గోపీచంద్ కొత్త సినిమా ఓపెనింగ్.. ఆ డైరెక్టర్ తో.. ఈ సారి హిట్ పక్కా..

సినిమా విశ్లేషణ.. మలయాళంలో ఇలాంటి మర్డర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ రెగ్యులర్ గా వచ్చి మెప్పిస్తాయని తెలిసిందే. ఇది కూడా అదే కోవలోకి చెందిన సినిమా. అయితే ఇందులో 1985లో నిజంగా మమ్ముట్టి చేసిన కాతోడు కాథోరమ్ సినిమా రిఫరెన్స్ తీసుకొని AIతో మమ్ముట్టిని తీసుకొచ్చి ఫ్లాష్ బ్యాక్ లో అప్పటి సెటప్స్ ని తీసుకురావడం గమనార్హం. ఆ సినిమా నిజంగా ఉన్నా అమ్మాయి మిస్ అయింది అనేది మాత్రం ఈ సినిమా కోసం ఒక కల్పిత కథగా రాసుకున్నారు.

సినిమా ఆరంభంలోనే రాజేంద్రన్ సూసైడ్ చేసుకొని, అస్థిపంజరం బయటపడి ఆసక్తిగా సాగుతుంది. విలన్ ఎవరో ముందే చెప్పేసినా అతనే విలన్ అని ప్రూవ్ చేయడం ఎలా అనేది థ్రిల్లింగ్ గా రాసుకున్నారు. కథను ప్రస్తుతంలో విచారణతో పాటు, ఫ్లాష్ బ్యాక్ లో రేఖ గురించి సమాంతరంగా చూపించి మంచి స్క్రీన్ ప్లే రాసుకున్నారు. ఆ ఆస్థిపంజరం ఎవరిది, ఆమెదేనా? అసలు రేఖ ఎవరు? అని ఎలా కనిపెడతారో సాగే డ్రామా సస్పెన్స్ గా ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ట్విస్ట్ లు బాగుంటాయి. ఆ అమ్మాయిని ఎవరు? ఎందుకు చంపారు అనేది ముందే ఎవరూ ఊహించలేరు.

కేవలం రిఫరెన్స్ తీసుకున్నా అప్పుడు కాతోడు కాథోరమ్ సినిమాకు నిజంగా వర్క్ చేసిన వాళ్ళందరి పాత్రలు డిజైన్ చేయడం, వాళ్లలో బతికున్న వాళ్ళని కొంతమందిని ఇప్పుడు ఎంక్వేరికి తీసుకొచ్చినట్టు ఆ సినిమాకు, ఈ సినిమాకు కనెక్ట్ చేసే సీన్స్ బాగా రాసుకున్నారు. కాకపోతే అన్ని మలయాళం సినిమాల్లాగే కాస్త స్లో నేరేషన్ ఉంటుంది. పూర్తిగా కేరళ బ్యాక్ డ్రాప్ సినిమా. ఈ సినిమా మలయాళంలో పెద్ద హిట్ అయి 50 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఓటీటీల్లో కూడా మంచి వ్యూస్ తెచ్చుకుంటుంది.

rekha chitram review

నటీనటుల పర్ఫార్మెన్స్.. వివేక్ గా పోలీసాఫీసర్ పాత్రలో అసిఫ్ అలీ చాలా బాగా నటించాడు. రేఖ పాత్రలో అనశ్వర రాజన్ క్యూట్ గా మెప్పిస్తుంది. విన్సెంట్ పాత్రలో మనోజ్ కె జయన్ నెగిటివ్ షేడ్స్ లో మెప్పిస్తాడు. జరీనా, హరిశ్రీ, ఇంద్రాన్, సిద్దిఖ్, జగదీష్.. మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో బాగా మెప్పించారు. ఈ సినిమాకు క్యాస్టింగ్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఫ్లాష్ బ్యాక్ కి, ప్రస్తుతానికి సూట్ అయ్యే యంగ్, ఓల్డ్ వర్షన్స్ నటీనటులను బాగా వెతికి పట్టుకున్నారు. మమ్ముట్టి పాత్రలో నటించిన వ్యక్తి కూడా అచ్చం ఆయన లాగే బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేసాడు.

Also Read : Jagga Reddy : సినిమాల్లోకి జగ్గారెడ్డి.. ఏ పాత్ర‌, ఏ మూవీలోనంటే?

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సస్పెన్స్ థ్రిల్లింగ్ కు కరెక్ట్ గా సెట్ అయింది. లొకేషన్స్ అన్ని కేరళలోనే న్యాచురల్ గా చూపించారు. మమ్ముట్టి AI లుక్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఒక అమ్మాయి మిస్ అయింది అనే పాయింట్ ని ఒక పాత సినిమాకు కనెక్ట్ చేసి కొత్త కథనంగా ఆసక్తిగా తెరకెక్కించారు దర్శకుడు. నిర్మాణపరంగా కూడా క్వాలిటీ అవుట్ ఫుట్ ఇచ్చేలాగే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘రేఖాచిత్రం’ సినిమా ఓ అస్థిపంజరంతో మొదలై 1985లో మమ్ముట్టి షూటింగ్ నుంచి మిస్ అయిన రేఖ అనే అమ్మాయి ఎవరు? ఆమెని ఎందుకు చంపారు అని కల్పిత కథతో సస్పెన్స్ థ్రిల్లింగ్ గా మెప్పిస్తుంది.

గమనిక : ఈ సినిమా రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.