Jagga Reddy : సినిమాల్లోకి జగ్గారెడ్డి.. ఏ పాత్ర‌, ఏ మూవీలోనంటే?

తెలంగాణ మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి రాజ‌కీయాల నుంచి సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు.

Jagga Reddy : సినిమాల్లోకి జగ్గారెడ్డి.. ఏ పాత్ర‌, ఏ మూవీలోనంటే?

congress leader jagga reddy said he will soon act in movies

Updated On : March 10, 2025 / 1:31 PM IST

సినీ రంగం నుంచి ఎంతో మంది రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టారు. వారిలో చాలా మంది రాజ‌కీయాల్లో స‌క్సెస్ అయ్యారు. కొంద‌రు ముఖ్య‌మంత్రులుగానూ ప‌ని చేశారు. అయితే.. ఈ ట్రెండ్‌కు కాస్త భిన్నంగా తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డి రాజ‌కీయాల నుంచి సినీ రంగంలోకి అడుగుపెడుతున్నారు.

ల‌వ్ స్టోరీ అనే చిత్రంలో ఆయ‌న న‌టిస్తున్నారు. నేడు ఆయ‌న క్యారెక్ట‌ర్ సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడారు జ‌గ్గారెడ్డి. తాను ల‌వ్‌స్టోరీ అనే చిత్రంలో స్పెష‌ల్ రోల్‌లో న‌టిస్తున్న‌ట్లు చెప్పారు. ఈ చిత్రంలోని పాత్ర త‌న ఒరిజనల్ క్యారెక్టర్ కు చాలా దగ్గ‌ర‌గా ఉంటుంద‌న్నారు.

Home Town Teaser : ఆక‌ట్టుకుంటోన్న ‘హోం టౌన్’ టీజ‌ర్‌.. 100కి 116 మార్కులు..

ఈ కార‌ణంతోనే తాను ఈ చిత్రంలో న‌టిస్తున్న‌ట్లు చెప్పుకొచ్చారు. పీసీసీ, ముఖ్య‌మంత్రి అనుమతితోనే సినిమాలో నటిస్తాన‌ని, ఈ ఉగాదికి నాటికి మరిన్ని సినిమా స్టోరీలు వింటానని చెప్పారు. ప్రస్తుతం తాను నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఉగాదికి ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు తెలిపారు.

ఓ వ్యక్తి కలిసి నా క్యారెక్టర్ కు తగ్గట్టుగా క్యారెక్టర్ ఉన్న సినిమా ఉందని చెప్పార‌ని, మూవీలో నటించమని అడిగారని జ‌గ్గారెడ్డి చెప్పారు. త‌న పాత్ర ఇంటర్వల్ కు ముందు మొద‌లు అవుతుంద‌ని, మూవీ చివ‌రి వ‌ర‌కు ఉంటుంద‌న్నారు.