The Paradise Teaser : ది ప్యారడైజ్ టీజర్.. నాని వీర మాస్ విధ్వంసం.. అదిరిపోయిన జడల్ జమానా..
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ది ప్యారడైజ్ (The Paradise Teaser) చిత్ర టీజర్ విడుదలైంది.
Nani The Paradise Teaser out now
The Paradise Teaser : నేచురల్ స్టార్ నాని నటిస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కయాదు లోహర్ కథానాయికగా నటిస్తుండగా మోహన్ బాబు, రాఘవ్ జుయల్లు కీలక పాత్రలను పోషిస్తున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా మూవీ తరువాత నాని-శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘ఆయా షేర్’ పాట ఓ ఊపు ఊపేసింది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఒక నిమిషం 35 సెకన్ల నిడివి గల ఈ టీజర్ అదిరిపోయింది. కథా ప్రపంచాన్ని, గాఢతను ఆవిష్కరించింది. జడల్ పాత్రలో నాని చెప్పిన డైలాగ్‌లు ఈలలు వేయిస్తున్నాయి. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 24న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ బాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ మూవీలో తనికెళ్ల భరణి, సోనాని కులకర్ణి, సంపూర్ణేశ్ బాబు నటిస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.
