Nara Rohit : బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో నారా రోహిత్.. రౌద్రంతో ఫస్ట్ లుక్ అదిరిందిగా..

ఈ సినిమాలో మంచు మనోజ్, నారా రోహిత్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్టు సమాచారం.

Nara Rohit : బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో నారా రోహిత్.. రౌద్రంతో ఫస్ట్ లుక్ అదిరిందిగా..

Nara Rohit First Look Released from Bellamkonda Sai Srinivas Bhairavam Movie

Updated On : November 6, 2024 / 4:18 PM IST

Nara Rohit : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఇటీవల భైరవం అనే సినిమాని ప్రకటించారు. అల్లరి నరేష్ తో నాంది, ఉగ్రం.. లాంటి హిట్ సినిమాలు తీసిన విజయ్ కనకమేడల దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ నిర్మాణంలో ఈ సినిమాను ప్రకటించారు. ‘భైరవం’ పోస్టర్ లో బెల్లంకొండ శ్రీనివాస్ ఓ గుడిముందు కూర్చొని ఓ చేతిలో త్రిశూలం, ఓ చేతిలో కొడవలి పట్టుకొని రౌద్రంగా ఉన్నాడు.

Also Read : Actress Kasthuri : తెలుగు వారిపై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. న‌టి క‌స్తూరిపై కేసు న‌మోదు..

అయితే ఈ సినిమాలో మంచు మనోజ్, నారా రోహిత్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్టు సమాచారం. భైరవం సినిమాని ప్రకటిస్తూ వాళ్ళిద్దర్నీ ట్యాగ్ చేసారు. తాజాగా నేడు నారా రోహిత్ ఫస్ట్ లుక్ ని ఈ సినిమా నుంచి రిలీజ్ చేసారు. ఇందులో వరద అనే పాత్రలో నారా రోహిత్ నటిస్తున్నాడు. నారా రోహిత్ పోస్టర్ కూడా అదే గుడి ముందు ఓ యాక్షన్ సీన్ లోంచి తీసుకున్నట్టు తెలుస్తుంది.

 

Image

దీంతో ఈ సినిమాలో నారా రోహిత్, మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ ముగ్గురు హీరోలు కలిసి భారీ మల్టీస్టారర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ యాక్షన్ సినిమా ముగ్గురు హీరోలు కలిసి ఎలా చూపిస్తారో చూడాలి.