Site icon 10TV Telugu

Nara Rohit : నారా రోహిత్‌ సినిమాలకు ఆరేళ్ళు గ్యాప్ ఎందుకిచ్చారు..? క్లారిటీ ఇచ్చిన నారా రోహిత్..

Nara Rohit gives Clarity about his Career Gap in Movies

Nara Rohit gives Clarity about his Career Gap in Movies

Nara Rohit : సోలో, ప్రతినిధి, అప్పట్లో ఒకడుండేవాడు, రౌడీఫెలో.. లాంటి సూపర్ హిట్ సినిమాలతో ఒకప్పుడు మెరిశాడు నారా రోహిత్. కొన్ని సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ లు కూడా ఇచ్చాడు. అయితే ఆ తర్వాత నారా రోహిత్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. చివరిసారిగా 2018లో వీరభోగ వసంత రాయలు సినిమాలో చివరిసారిగా కనపడ్డారు. అప్పట్నుంచి మళ్ళీ నారా రోహిత్ తెరపై కనపడలేదు.

ఇప్పుడు నారా రోహిత్ ప్రతినిధి 2 సినిమాతో ఆరేళ్ళ తర్వాత కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు. ఏప్రిల్ 25న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత సుందరకాండ సినిమాని కూడా ప్రకటించారు. ప్రస్తుతం ప్రతినిధి 2 సినిమా ప్రమోషన్స్ లో ఉన్న నారా రోహిత్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాలకు ఎందుకు గ్యాప్ ఇచ్చారో తెలిపారు.

Also Read : Sivaji : డబ్బుల్లేకపోవడంతో శివాజీకి రెంట్ కట్టిన మెగాస్టార్.. ఆ సమయంలో.. ఎంతంటే..?

నారా రోహిత్ మాట్లాడుతూ.. 2017, 2018 ఆ సమయంలో నా సినిమాలు వరుసగా ఫెయిల్ అయ్యాయి. నా సినిమాలు నాకే కొన్ని నచ్చలేదు. నేను సెలెక్ట్ చేసుకున్న సినిమాలే నాకు నచ్చలేదు. స్క్రిప్ట్ సెలెక్షన్ కూడా నాకు నచ్చలేదు అనిపించింది. దీంతో ఓ రెండేళ్లు గ్యాప్ తీసుకుందాము అనుకున్నాను. ఆ తర్వాత కరోనా కూడా రావడంతో ఆ గ్యాప్ ఇంకా పెరిగింది. కానీ ఈ గ్యాప్ లో చాలా కథలు విన్నాను. వాటిల్లో కొన్ని ఓకే చేసాను. ఇప్పుడు ప్రతినిధి 2తో వస్తున్నాను. ఆ తర్వాత కూడా ఇకపై వరుసగా సినిమాలు వస్తాయి. మళ్ళీ గ్యాప్ తీసుకోను, మంచి కథలతో వస్తాను అని తెలిపారు.

Exit mobile version