Sivaji : డబ్బుల్లేకపోవడంతో శివాజీకి రెంట్ కట్టిన మెగాస్టార్.. ఆ సమయంలో.. ఎంతంటే..?

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి తనకు చేసిన సాయం గురించి శివాజీ మాట్లాడుతూ..

Sivaji : డబ్బుల్లేకపోవడంతో శివాజీకి రెంట్ కట్టిన మెగాస్టార్.. ఆ సమయంలో.. ఎంతంటే..?

Sivaji Revealed about Megastar Chiranjeevi Help to him

Updated On : April 21, 2024 / 2:25 PM IST

Sivaji : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) మనకు తెలిసే ఎన్నో సేవా కార్యక్రమాలు, దానధర్మాలు చేశారు. ఇక తెలియకుండా సినీ పరిశ్రమ వ్యక్తులకు, అభిమానులకు ఎంతోమందికి సహాయం చేసారు. అప్పుడప్పుడు పలువురు చిరంజీవి చేసిన సహాయాలు గురించి చెప్తూ ఉంటారు. తాజాగా నటుడు శివాజీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి తనకు చేసిన ఓ సాయం గురించి తెలిపారు.

నటుడిగా, హీరోగా ఎన్నో సక్సెస్ లు చుసిన శివాజీ కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉండి, రాజకీయాల్లోకి వెళ్లి వచ్చి, ఇటీవల బిగ్ బాస్ లోకి వచ్చి మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. బిగ్ బాస్ తర్వాత సిరీస్ లు, సినిమాలు ఓకే చెప్తూ వరుస ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. ఇక శివాజీ మొదటి నుంచి కూడా చిరంజీవి ఫ్యాన్ అని అనేక సందర్భాల్లో తెలిపాడు. మెగాస్టార్ చిరంజీవితో కలిసి పలు సినిమాల్లో నటించాడు కూడా శివాజీ.

Also Read : Ghilli Movie : రీ రిలీజ్ సినిమాకి ఒక్క రోజు అన్ని కోట్ల కలెక్షన్స్ ఏంట్రా బాబు.. అది కూడా రీమేక్ సినిమాకు..

తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి తనకు చేసిన సాయం గురించి శివాజీ మాట్లాడుతూ.. మాస్టర్ సినిమా చేసేటప్పుడు ఆయనకు నేను ఒక అభిమానిగా, ఒక ఆర్టిస్ట్ గా మాత్రమే తెలుసు. ఫుల్ జోష్ లో షూటింగ్ జరుగుతుంది. అప్పుడు నా దగ్గర రూమ్ రెంట్ కట్టడానికి డబ్బుల్లేవు. కొంచెం ఇబ్బంది పడుతున్నాను. నేను లేనప్పుడు ఈ విషయం ఎవరో చిరంజీవి గారితో సరదాగా మాట్లాడుతున్నప్పుడు చెప్పారు. షూటింగ్ అయ్యాక చిరంజీవి గారు నా దగ్గరికి వచ్చి పదివేల రూపాయలు ఇచ్చారు. నేను ఎందుకు, వద్దు అంటున్నా ఇచ్చారు. ఆ డబ్బులతో సంవత్సరం వరకు నాకు రెంట్ కి ఇబ్బంది కలగకుండా చేసారు. అప్పటికి నేను ఆయనకు అంతగా తెలీదు. ఆ సినిమాలోనే పరిచయం. అయినా నా కోసం ఆయన అంత చేశారు అని తెలిపారు.

అందుకే ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొనే అప్పట్నుంచి నాకు తోచినంతలో ఎవరికైనా అవసరం ఉంటే నేను కూడా సహాయం చేయడం మొదలుపెట్టాను అని తెలిపారు. దీంతో చిరంజీవిని మరోసారి అభినందిస్తున్నారు.