Ghilli Movie : రీ రిలీజ్ సినిమాకి ఒక్క రోజు అన్ని కోట్ల కలెక్షన్స్ ఏంట్రా బాబు.. అది కూడా రీమేక్ సినిమాకు..

విజయ్, త్రిష జంటగా మహేష్ బాబు ఒక్కడు సినిమాకు రీమేక్ గా తమిళ్ లో వచ్చిన 'గిల్లి' సినిమా రిలీజయి ఇరవై ఏళ్ళు అయిన సందర్భంగా ఏప్రిల్ 20న భారీగా రీ రిలీజ్ చేసారు.

Ghilli Movie : రీ రిలీజ్ సినిమాకి ఒక్క రోజు అన్ని కోట్ల కలెక్షన్స్ ఏంట్రా బాబు.. అది కూడా రీమేక్ సినిమాకు..

Vijay Trisha Ghilli Movie Re Release First Day Collections Creates Record

Updated On : April 21, 2024 / 1:56 PM IST

Ghilli Movie Re Release : ఇటీవల అనేక సినిమాలు రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. రీ రిలీజ్ లో కూడా పలు సినిమాలకు అభిమానులు, సినిమా లవర్స్ వచ్చి కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నారు. రీ రిలీజ్ లకు కూడా కోట్లలో కలెక్షన్స్ వస్తున్నాయి. ఆల్మోస్ట్ చాలా మంది స్టార్ హీరోల సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ అయినా మహా అయితే అయిదు లేదా ఆరు కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. అది కూడా రెండు, మూడు రోజులకు. కానీ తాజాగా ఈ సినిమా రీ రిలీజ్ లో కూడా సరికొత్త రికార్డ్ సృష్టించింది.

తమిళ్ లో కూడా సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. విజయ్, త్రిష జంటగా మహేష్ బాబు ఒక్కడు సినిమాకు రీమేక్ గా తమిళ్ లో వచ్చిన ‘గిల్లి’ సినిమా అప్పట్లో భారీ విజయం సాధిచింది. 2004లో ఈ సినిమా రిలీజవ్వగా ఇరవై ఏళ్ళు అయిన సందర్భంగా నిన్న ఏప్రిల్ 20న గిల్లి సినిమాని భారీగా రీ రిలీజ్ చేసారు. కేవలం తమిళనాడులోనే కాక దేశవ్యాప్తంగా, విదేశాల్లో కూడా గిల్లి సినిమా రీ రిలీజ్ అయింది.

Also Read : Samantha : మహేష్, అల్లు అర్జున్ కంటే ఫాస్ట్‌గా ఆ రికార్డ్ సాధించిన సమంత..

గిల్లి రీ రిలీజ్ కి థియేటర్స్ లో ఆడియన్స్, అభిమానుల రెస్పాన్స్ అదిరిపోయింది. పాటలు కూడా అప్పట్లో భారీ హిట్ సాంగ్స్ కావడంతో పాటలకు థియేటర్స్ లో స్టెప్పులు వేస్తున్నారు అభిమానులు. త్రిష కూడా గిల్లి రీ రిలీజ్ వీడియోలు షేర్ చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. అయితే గిల్లి రీ రిలీజ్ లో కూడా అదిరిపోయే కలెక్షన్స్ సాధించింది. గిల్లి మొదటి రోజే ఏకంగా 10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ఇప్పటివరకు రిలీజ్ అయిన రీ రిలీజ్ సినిమాల కలెక్షన్స్ లో హైయెస్ట్ గా నిలిచింది. ఇంకో రెండు లేదా మూడు రోజులు థియేటర్స్ లో గిల్లి రీ రిలీజ్ కొనసాగుతుంది. దీంతో ఈ కలెక్షన్స్ మరింత పెరుగనున్నాయి.

View this post on Instagram

A post shared by Trish (@trishakrishnan)

అయితే ఒక రీ రిలీజ్ సినిమాకి ఒక్క రోజులో 10 కోట్ల కలెక్షన్స్ రావడం ఒక ఎత్తైతే ఇది రీమేక్ సినిమా కావడం గమనార్హం. దీంతో విజయ్ అభిమానులు మరో రికార్డ్ సెట్ చేశాము అంటూ సోషల్ మీడియాలో గిల్లి సినిమాని వైరల్ చేస్తున్నారు.