Samantha : మహేష్, అల్లు అర్జున్ కంటే ఫాస్ట్‌గా ఆ రికార్డ్ సాధించిన సమంత..

ఫాస్ట్ గా 200 మిలియన్ వ్యూస్ సాధించిన సాంగ్స్ అంటూ మరో రికార్డ్ ని బయటకు తీశారు.

Samantha : మహేష్, అల్లు అర్జున్ కంటే ఫాస్ట్‌గా ఆ రికార్డ్ సాధించిన సమంత..

Fastest 200 Million Views Songs in YouTube Samantha Beat Mahesh and Allu Arjun Records

Samantha : మన హీరోలు, హీరోయిన్స్ సృష్టించే రికార్డులని అభిమానులు గొప్పగా చెప్పుకుంటారు. కేవలం సినిమాలతోనే కాదు పాటలతో కూడా రికార్డులు సృష్టిస్తారు. స్టార్ సెలబ్రిటీల నుంచి ఒక పాట రిలీజయితే అది ఎన్ని వ్యూస్ తెచ్చింది, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎన్ని రోజులు ట్రేండింగ్ లో ఉంది, ఎంత ఫాస్ట్ గా అందరికి రీచ్ అయింది.. ఇలా వీటిల్లో కూడా అభిమానులు రికార్డులు చూపించుకుంటున్నారు తమ హీరోలవి.

ఇక పాటలు బాగుంటే వందల కోట్ల వ్యూస్ వస్తాయని తెలిసిందే. ముఖ్యంగా అల్లు అర్జున్(Allu Arjun), సాయి పల్లవి సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డులు సెట్ చేసి పెట్టాయి. ఇటీవల మహేష్ బాబు(Mahesh Babu) గుంటూరు కారం(Guntur Kaaram) సినిమా నుంచి వచ్చిన ‘కుర్చీ మడతబెట్టి’ సాంగ్ తాజాగా రెండొందల మిలియన్ వ్యూస్ సాధించింది. మహేష్, శ్రీలీల స్టెప్పులకు థియేటర్స్ ఏ రేంజ్ లో దద్దరిల్లాయో తెలిసిందే. యూట్యూబ్ లో కూడా ఆ పాట దాదాపు 20 కోట్ల వ్యూస్ ని సాధించి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. అయితే ఇప్పటికే 200 మిలియన్ వ్యూస్ సాధించిన సాంగ్స్ చాలా ఉన్నాయి.

Also Read : Rama Rajamouli : త్రివిక్రమ్ భార్య లాగే రాజమౌళి భార్య కూడా.. రమా రాజమౌళిలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా?

వాటిల్లో ఫాస్ట్ గా 200 మిలియన్ వ్యూస్ సాధించిన సాంగ్స్ అంటూ మరో రికార్డ్ ని బయటకు తీశారు. కుర్చీ మడతబెట్టి సాంగ్ 200 మిలియన్ వ్యూస్ సాధించడానికి 78 రోజులు పట్టింది. అయితే పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ సాంగ్ అయితే కేవలం 68 రోజుల్లోనే 200 మిలియన్స్ వ్యూస్ సాధించింది.

అల్లు అర్జున్ ‘బుట్టబొమ్మ’ సాంగ్ 200 మిలియన్ వ్యూస్ రావడానికి 95 రోజులు పట్టింది. ఇలా ఫాస్ట్ గా 200 మిలియన్స్ వ్యూస్ సాధించిన సాంగ్స్ లో సమంత ఊ అంటావా ఊ ఊ అంటావా మొదటి ప్లేస్ లో ఉంటే, మహేష్ కుర్చీ మడతబెట్టి సాంగ్ రెండో ప్లేస్ లో ఉంది. అల్లు అర్జున్ బుట్టబొమ్మ సాంగ్ మూడో ప్లేస్ లో ఉంది. ఈ రికార్డ్ లో మాత్రం మహేష్, బన్నీని దాటించి మరీ సమంత టాప్ లో నిలిచింది అని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఆ సాంగ్ లో అల్లు అర్జున్ కూడా ఉండటం గమనార్హం.