Rama Rajamouli : త్రివిక్రమ్ భార్య లాగే రాజమౌళి భార్య కూడా.. రమా రాజమౌళిలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా?

రమా రాజమౌళిలో కాస్ట్యూమ్ డిజైనర్ మాత్రమే కాదు ఇంకో ట్యాలెంట్ కూడా ఉందట.

Rama Rajamouli : త్రివిక్రమ్ భార్య లాగే రాజమౌళి భార్య కూడా.. రమా రాజమౌళిలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా?

Rajamouli Wife Rama Rajmouli Having another Talent also Not Only Costume Designer

Updated On : April 21, 2024 / 12:15 PM IST

Rama Rajamouli : రమా రాజమౌళి.. రాజమౌళి భార్యగా అందరికి పరిచయమే. అలాగే సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా కూడా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. రాజమౌళి అన్ని సినిమాలకు రమా రాజమౌళినే కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు. ఆమె ఆధ్వర్యంలో ఆమె టీమ్ అంతా పనిచేస్తారు. ఆర్టిస్ట్ గా కూడా గతంలో అమృతం సీరియల్ లో కొన్ని ఎపిసోడ్స్ లో మెప్పించింది. రమా రాజమౌళి కూడా ప్రమోషన్స్ లో, బయట చాలా యాక్టివ్ గా కనిపిస్తారు.

అయితే రమా రాజమౌళిలో కాస్ట్యూమ్ డిజైనర్ మాత్రమే కాదు ఇంకో ట్యాలెంట్ కూడా ఉందట. ఇటీవల రాజమౌళి, రమా రాజమౌళి కలిసి ఓ పెళ్ళిలో డాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ డాన్స్ వీడియోలు వైరల్ గా మారాయి. తాజాగా రాజమౌళి జంటకు డాన్స్ నేర్పించిన డాన్స్ మాస్టర్ రాధాకృష్ణ ఇచ్చిన ఇంటర్వ్యూలో రమా రాజమౌళి గురించి ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు.

Also Read : Rajamouli Dance : ఇటీవల భార్యతో రాజమౌళి డాన్స్.. ఎవరు నేర్పించారో తెలుసా? పవన్ కళ్యాణ్ పాటకు కూడా రాజమౌళి డాన్స్..

రాధాకృష్ణ మాస్టర్ మాట్లాడుతూ.. నేను డాన్స్ నేర్పిస్తున్నప్పుడు రమా రాజమౌళి గారు చాలా ఈజీగా చేసేస్తున్నారు. నేను ఆవిడే ఎక్కువ సేపు నేర్చుకుంటారేమో అనుకున్నాను. ఎంత కష్టమైనా స్టెప్ అయినా ఈజీగా చేస్తున్నారు. నాకు డౌట్ వచ్చి అంత ఈజీగా ఎలా చేసేస్తున్నారు అని అడిగితే.. ఆవిడ క్లాసికల్ డ్యాన్సర్ అని, చిన్నప్పుడు క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాను అని చెప్పినట్లు తెలిపారు. దీంతో రాజమౌళి లాగే ఆయన భార్య కూడా మల్టీ ట్యాలెంటెడ్ అని పొగిడేస్తున్నారు. మరి రమా రాజమౌళి కూడా ఎప్పుడన్నా క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఇస్తారేమో చూడాలి.

ఇక దర్శకుడు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య కూడా క్లాసికల్ డాన్సర్ అని తెలిసిందే. ఇప్పటికీ ఆవిడ పలు క్లాసికల్ డాన్స్ పర్ఫార్మెన్స్ లు ఇస్తూ ఉంటారు.