Rajamouli Dance : ఇటీవల భార్యతో రాజమౌళి డాన్స్.. ఎవరు నేర్పించారో తెలుసా? పవన్ కళ్యాణ్ పాటకు కూడా రాజమౌళి డాన్స్..

ఇటీవల కొన్ని రోజుల క్రితం రాజమౌళి - రామ రాజమౌళి కలిసి ఓ పెళ్లి వేడుకలో డాన్స్ వేసిన వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Rajamouli Dance : ఇటీవల భార్యతో రాజమౌళి డాన్స్.. ఎవరు నేర్పించారో తెలుసా? పవన్ కళ్యాణ్ పాటకు కూడా రాజమౌళి డాన్స్..

Rajamouli Rama Rajamouli Personal Dance Master Revealed

Rajamouli Dance : బాహుబలితో ఇండియా టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా నిలిచిన రాజమౌళి RRR సినిమాతో హాలీవుడ్ రేంజ్ కి ఎదిగిన సంగతి తెలిసిందే. దీంతో రాజమౌళి నుంచి రాబోయే నెక్స్ట్ మహేష్ బాబు సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే రాజమౌళి ఎంత ఎక్కువ కష్టపడతాడో వర్క్ లేనప్పుడు అంతే సమయం ఫ్యామిలీకి కేటాయిస్తాడు. ఇటీవల కొన్ని రోజుల క్రితం రాజమౌళి – రామ రాజమౌళి కలిసి ఓ పెళ్లి వేడుకలో డాన్స్ వేసిన వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. ‘అంద‌మైన ప్రేమ‌రాణి చెయ్యి త‌గిలితే..’ అనే సూపర్ హిట్ పాటకి రాజమౌళి – రమా రాజమౌళి స్టేజిపై డాన్స్ వేసి అదరగొట్టారు. ఆ తర్వాత ఈ పాట రిహార్సిల్ చేసిన వీడియో కూడా లీక్ అయి వైరల్ అయింది.

అయితే తాజాగా ఓ డాన్స్ మాస్టర్ రాజమౌళి – రమాల డాన్స్ గురించి మాట్లాడారు. డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ దగ్గర పనిచేసే రాధాకృష్ణ మాస్టర్ ఈ జంటకి ఈ డాన్స్ నేర్పించారంట.

RK (రాధాకృష్ణ) మాస్టర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మొదటిసారి RRR సినిమా ముందు రాజమౌళి గారి తనయుడు కార్తికేయ పెళ్లికి వాళ్ళకి డాన్స్ నేర్పించడానికి ప్రేమ్ రక్షిత్ మాస్టర్ తో కలిసి వెళ్ళాను. డాన్స్ నేర్చుకోవడం కూడా రాజమౌళి చాలా డెడికేటెడ్ గా చేస్తారు. పర్ఫెక్ట్ గా వచ్చే వరకు ప్రాక్టీస్ చేస్తారు. అప్పట్నుంచి రాజమౌళి గారు పరిచయం. రీసెంట్ గా ఒక పెళ్లి వేడుకలో డాన్స్ కోసం నను పిలిచారు. ఒక నాలుగు పాటలు సెలెక్ట్ చేసుకొని వాటికి చాలా రోజులు నేర్చుకున్నారు. పొద్దున్నే ఆరింటికి వెళ్లి నేర్పించేవాడిని. అసలు అవి లీక్ అవ్వకూడదు కానీ అయ్యాయి. ఒకటే పాట అందమైన ప్రేమారాణి సాంగ్ డాన్స్ లీక్ అయింది. కానీ పవన్ కళ్యాణ్.. మెలికెల్ తిరిగెన్ అమ్మాయో.. సాంగ్ తో పాటు ఇంకో రెండు పాటలకు కూడా రాజమౌళి – రమా రాజమౌళి కలిసి డాన్స్ చేసారు. అన్ని పాటలకు కష్టపడి నేర్చుకొని చేశారు ఇద్దరూ అని తెలిపాడు.

Also Read : Chandini Chowdary : మా ఆంధ్రాకు ఐపీఎల్ టీమ్ లేదు.. ఐపీఎల్ పై చాందిని ఆసక్తికర వ్యాఖ్యలు.. SRH ఫ్యాన్స్ ఏమంటారో?

దీంతో డాన్స్ మాస్టర్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. పెళ్ళిలో స్టేజిపైన చేసే డాన్స్ కి కూడా రాజమౌళి ఇంత కష్టపడ్డాడా అని ఆశ్చర్యపోతున్నారు. ఇక మిగిలిన పాటల డాన్స్ వీడియోలు కూడా లీక్ అయితే బాగుండు అని కామెంట్స్ చేస్తున్నారు.