Chandini Chowdary : మా ఆంధ్రాకు ఐపీఎల్ టీమ్ లేదు.. ఐపీఎల్ పై చాందిని ఆసక్తికర వ్యాఖ్యలు.. SRH ఫ్యాన్స్ ఏమంటారో?

చాందిని చౌదరిని.. మీ ఫేవరేట్ ఐపీఎల్ టీమ్ ఏంటి అని అడగగా చాందిని సమాధానమిస్తూ..

Chandini Chowdary : మా ఆంధ్రాకు ఐపీఎల్ టీమ్ లేదు.. ఐపీఎల్ పై చాందిని ఆసక్తికర వ్యాఖ్యలు.. SRH ఫ్యాన్స్ ఏమంటారో?

Chandini Chowdary Interesting Comments on IPL What will be the reaction of SRH fans

Updated On : April 21, 2024 / 10:39 AM IST

Chandini Chowdary : తెలుగమ్మాయి చాందిని చౌదరి ఇటీవల వరుస సినిమాలు, సిరీస్ లతో మంచి విజయాలు సాధిస్తుంది. ఇటీవలే గామి సినిమాతో వచ్చి థియేటర్స్ లో, ఓటీటీలో పెద్ద హిట్ కొట్టింది. ఇక చాందిని మొదటి నుంచి కూడా ఢిఫరెంట్ కథలతో, కొత్త కొత్త పాత్రలతో మెప్పిస్తుంది. త్వరలో మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాతో రాబోతుంది. అజయ్ ఘోష్, చాందిని చౌదరి మెయిన్ లీడ్స్ లో ఒక కొత్త కథతో మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా రాబోతుంది.

తాజాగా మ్యూజిక్ షాప్ మూర్తి టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో ప్రెస్ మీట్ కూడా జరగ్గా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు మూవీ టీమ్. ఈ క్రమంలో చాందిని చౌదరిని.. మీ ఫేవరేట్ ఐపీఎల్ టీమ్ ఏంటి అని అడగగా చాందిని సమాధానమిస్తూ.. నా జీవితంలో ఒక్కసారైనా ఐపీఎల్ మ్యాచ్ స్టేడియంలో చూడాలని ఉంది. ఇప్పటివరకు ఒక్కసారి కూడా స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ చూడలేదు. కాకపోతే CCL మ్యాచ్ లు చూశాను. ఒక్కసారి మ్యాచ్ లు చూసి నేను ఆ టీమ్స్ నుంచి ఏది ఫేవరేట్ అని సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే మాది ఆంధ్ర కదా మా ఆంధ్రకు టీమ్ లేదు అని చెప్పింది.

Also Read : Vishal : తమిళనాడు ప్రభుత్వంపై విశాల్ సంచలన కామెంట్స్.. మోదీ గారు మమ్మల్ని పట్టించుకోండి అంటూ రిక్వెస్ట్..

అయితే SRH ఉంది కదా అని అడిగితే మా ఆంధ్రకు మాత్రం టీమ్ లేదు కదా అని మళ్ళీ చెప్పింది చాందిని. దీంతో చాందిని చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మరి దీనిపై SRH ఫ్యాన్స్ ఏమంటారో చూడాలి.