నారా రోహిత్ నయా లుక్ చూశారా!..

Nara Rohith New Look: నారా వారి కుటుంబం నుంచి తొలి హీరోగా ‘బాణం’ చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమై ‘సోలో’, ‘ప్రతినిధి’, ‘అసుర’, ‘రౌడీ ఫెలో’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు నారా రోహిత్.
యూత్ మెచ్చే చిత్రాలతో పాటు ఉమ్మడి కుటుంబాల గొప్పదనం ఎంటో కూడా తన సినిమాల ద్వారా తెలియజేశారు. తాజాగా నారా రోహిత్ తన ట్విట్టర్ ఖాతా ప్రొఫైల్‌లో కొత్త ఫోటోను పెట్టుకున్నారు. ఫోటోలో పొడవైన గడ్డంతో పాటు మీసాలతో కనిపిస్తున్నారు. దేనికోసమో తీక్షణంగా చూస్తున్నట్లు ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
https://10tv.in/chiranjeevi-konidela-bold-new-look-fans-funny-comments/
2018లో వచ్చిన ‘వీరభోగ వసంతరాయలు’ చిత్రం తరువాత ఏ సినిమాలోనూ కనిపించలేదు రోహిత్. ప్రస్తుతం ఈ ఫోటోను చూస్తుంటే ఏదో కొత్త సినిమా కోసమే ఇలా మేకోవర్ అయ్యారనిపిస్తోంది. త్వరలో కొత్త సినిమా విశేషాలు తెలియచేస్తారని సమాచారం.
#NewProfilePic pic.twitter.com/fDWHqTFnvN
— Rohith Nara (@IamRohithNara) September 14, 2020