×
Ad

Gurram Paapi Reddy Review : ‘గుర్రం పాపిరెడ్డి’ మూవీ రివ్యూ.. ట్విస్టులతో కామెడీ మాములుగా లేదుగా..

ఫరియా ఈ సినిమా కోసం ఓ హిందీ తెలుగు మిక్స్ ర్యాప్ సాంగ్ రాసి పాడి పెర్ఫార్మ్ చేసింది. (Gurram Paapi Reddy Review)

Gurram Paapi Reddy Review

Gurram Paapi Reddy Review : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా తెరకెక్కిన సినిమా ‘గుర్రం పాపిరెడ్డి’. డా. సంధ్య గోలీ సమర్పణలో వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ నిర్మాణంలో మురళీ మనోహర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. బ్రహ్మానందం, యోగి బాబు, ప్రభాస్ శ్రీను, రాజ్ కుమార్ కాసిరెడ్డి, జీవన్ కుమార్, వంశీధర్ కోసిగి, జాన్ విజయ్, మొట్ట రాజేంద్రన్.. పలువురు కమెడియన్స్ కీలక పాత్రల్లో నటించారు. గుర్రం పాపిరెడ్డి సినిమా డిసెంబర్ 19న థియేటర్స్ లో రిలీజయింది.(Gurram Paapi Reddy)

కథ విషయానికొస్తే.. గుర్రం పాపిరెడ్డి(నరేష్ అగస్త్య) తన పాత పరిచయాలు అయిన చిలిపి(వంశీ), మిలిటరీ(రాజ్ కుమార్ కసిరెడ్డి), గొయ్యి(జీవన్)కి ఫోన్ చేసి కలుస్తాడు. తనతో పాటు సౌదామిని(ఫారియా అబ్దుల్లా)ని తీసుకొస్తాడు. శ్రీశైలం స్మశానంలో ఉన్న ఒక శవాన్ని తీసుకొచ్చి శ్రీనగర్ కాలనీలో ఉన్న కళింగ పోతురాజు అనే వ్యక్తి శవం ప్లేస్ లో మార్చాలని ప్లాన్ చెప్పి వీళ్లంతా కలిసి అష్టకష్టాలు పడి శవం మారుస్తారు. చిలిపి, మిలిటరీ తింగరితనం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు.

గుర్రం పాపిరెడ్డి ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నాడు అని డౌట్ పడి ప్రశ్నిస్తే ఒకప్పటి రాజులు కళింగ, చేర, బాలిక వంశాల కథలు చెప్పి కళింగ రాజులు అంతరించిపోయారు కాబట్టి స్మశానంలో గోతులు తీసుకునే గొయ్యిని కళింగ గవర్రాజుగా ప్రూవ్ చేసి వేల కోట్ల ఆస్తులు కొట్టేయడానికి అని చెప్తారు. దీంతో బాలిక వంశం రాజ వారసులు హయగ్రీవ, నీలగ్రీవ ఏం చేసారు? వాళ్ళు ముందు నుంచే గుర్రం పాపిరెడ్డి కోసం ఎందుకు వెతుకుతున్నారు? గొయ్యిని రాజ వంశీయుడిగా కోర్టు ఒప్పుకునేలా చేసారా? అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? శవాలు ఎందుకు మార్చారు? గుర్రం పాపిరెడ్డి, సౌదామిని, మిగిలిన వాళ్ళందరి కథలు ఏంటి.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Avatar Fire and Ash : ‘అవతార్ 3 : ఫైర్ అండ్ ఆష్’ మూవీ రివ్యూ.. మళ్ళీ పార్ట్ 2నే తీశారు కదరా బాబు..

సినిమా విశ్లేషణ..

బ్రహ్మానందం, యోగి బాబు, జీవన్.. వీళ్లంతా ఈ సినిమాలో నటించడం, వీళ్లంతా ప్రమోషన్స్ కి రావడం, టీజర్, ట్రైలర్స్ తో నవ్వించడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా గుర్రం పాపిరెడ్డి, చిలిపి, మిలిటరీ, గొయ్యి పాత్రల పరిచయం వీళ్ళు శవం మార్చడం, కోర్టులో కేసు వేయడంతో కామెడీగా సాగుతుంది. శవం మార్చే ప్రయత్నాలు అన్ని ఫుల్ గా నవ్విస్తాయి.

ఇంటర్వెల్ కి గుర్రం పాపిరెడ్డి గురించి ఓ ట్విస్ట్ ఇచ్చి నెక్స్ట్ ఏం జరుగుతుందని సెకండ్ హాఫ్ మీద ఆసక్తి నెలకొల్పుతారు. అయితే గుర్రం పాపిరెడ్డి, సౌదామిని ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని వీళ్ళ ఫ్లాష్ బ్యాక్ కథలు రొటీన్ అనిపిస్తాయి. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీలు కాస్త సాగదీశారు. సెకండ్ హాఫ్ లో ఒకదాని తర్వాత ఒకటి వచ్చే ట్విస్టులు, గుర్రం పాపిరెడ్డి గురించి వచ్చే ట్విస్టులు అన్ని ఆసక్తిగా సాగుతాయి. సెకండ్ హాఫ్ కూడా బాగానే నవ్వించారు.

కోర్టులో జడ్జిగా బ్రహ్మానందంతో చేసిన సీన్స్, యోగిబాబు కనిపించిన సీన్స్ లో ఫుల్ గా నవ్వుకుంటాము. అయితే చివర్లో కథని ముగించే స్కోప్ ఉన్నా మళ్ళీ అక్కర్లేని ట్విస్ట్ ఇచ్చి సెకండ్ హాఫ్ కి లీడ్ ఇచ్చారు. ఈ కథని ఎలా ముగించాలో తెలియక ఇలా సెకండ్ హాఫ్ కి లీడ్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. దాంతో సినిమా అంతా బాగానే నవ్వించి క్లైమాక్స్ సరిగ్గా రాసుకోలేదు అనిపిస్తుంది. అంతే కాక ముందు వచ్చే ట్విస్ట్ లు అన్ని మనం ఊహించలేక బాగానే ఎంజాయ్ చేస్తే ఆ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ మాత్రం ఈజీగా ఊహించేయొచ్చు.

నటీనటుల పర్ఫార్మెన్స్..

ఇన్నాళ్లు సెటిల్డ్ పర్ఫార్మెన్స్ లతో మెప్పించిన నరేష్ అగస్త్య మొదటిసారి తన కంఫర్ట్ జోన్ లోంచి బయటకు వచ్చి చాలా బాగా నటించాడు. ఫరియా అబ్దుల్లా ఎప్పట్లాగే తన పర్ఫార్మెన్స్ తో బాగానే మెప్పించింది. ఫరియా ఈ సినిమా కోసం ఓ హిందీ తెలుగు మిక్స్ ర్యాప్ సాంగ్ రాసి పాడి పెర్ఫార్మ్ చేసింది.

రాజ్ కుమార్ కసిరెడ్డి, జీవన్ ఫుల్ గా నవ్విస్తారు. జీవన్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయ్యాడు. బ్రహ్మానందం కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ జడ్జ్ పాత్రలో కనిపించి నవ్వించారు. తమిళ కమెడియన్ యోగిబాబు, మొట్ట రాజేంద్రన్ కూడా వారి పాత్రలతో నవ్వించారు. ప్రభాస్ శ్రీను, వంశీధర్, జాన్ విజయ్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే మెప్పించారు.

Also Read : Hyper Aadi : అన్నీ మానేసుకొని జనసేన పార్టీలోకి వెళ్ళను.. పవన్ కళ్యాణ్, జనసేన పై హైపర్ ఆది వ్యాఖ్యలు..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సెకండ్ హాఫ్ ఎడిటింగ్ లో కొంత కట్ చేస్తే బాగుండేది. ఓ కొత్త పాయింట్ ని డార్క్ కామెడీగా దర్శకుడు బాగానే రాసుకొని తెరకెక్కించినా క్లైమాక్స్ లో తడపడ్డాడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టారు.

మొత్తంగా ‘గుర్రం పాపిరెడ్డి’ సినిమా డబ్బుల కోసం జరిగే సస్పెన్స్ కామెడీ కథ. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. ఈ సినిమాకు 2.75 రేటింగ్ ఇవ్వొచ్చు.

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.