Hyper Aadi : అన్నీ మానేసుకొని జనసేన పార్టీలోకి వెళ్ళను.. పవన్ కళ్యాణ్, జనసేన పై హైపర్ ఆది వ్యాఖ్యలు..
తాజాగా హైపర్ ఆది ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాలు, పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ గురించి మాట్లాడాడు. (Hyper Aadi)
Hyper Aadi
Hyper Aadi : సినీ, టీవీ పరిశ్రమలో జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్న సంగతి తెలిసిందే. అందులో హైపర్ ఆది ఒకరు. జబర్దస్త్ తో కమెడియన్ గా ఫేమ్ తెచ్చుకున్న హైపర్ ఆది ఆ తర్వాత రైటర్ గా, కమెడియన్ గా టీవీ షోలు, సినిమాలతో దూసుకుపోతున్నాడు. హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అని ఇప్పటికే అనేకసార్లు తెలిపాడు.(Hyper Aadi)
జనసేన పార్టీ తరపున గత ఎన్నికల్లో అధికారికంగా ప్రచారం చేసాడు. జనసేన పార్టీ సభల్లో స్టేజిపై మాట్లాడాడు. జనసేన పార్టీకి విరాళం కూడా ఇచ్చాడు. తాజాగా హైపర్ ఆది ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాలు, పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ గురించి మాట్లాడాడు.
Hyper Aadi
హైపర్ ఆది మాట్లాడుతూ.. నేను సపరేట్ గా పాలిటిక్స్ కోసం ఏమి చేయను. నాకు తెలిసిన పాలిటిక్స్ కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆయన కోసం మాత్రమే నిలబడతా. ఆయన ఎప్పుడు ఏ ఎన్నికల్లో నిలబడినా ఆయన కోసం మాత్రమే నిలబడతా. ఆయన కోసం తిరుగుతాను. నాకు తెలిసిన పాలిటిక్స్ కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే. జనసేన రణస్థలం సభలో లక్షల మంది జనాలు, పవన్ కళ్యాణ్ గారి ముందు స్పీచ్ ఇచ్చాను. నా బెస్ట్ స్పీచ్ అదే. చాలా మంచి పాయింట్స్ కూడా మాట్లాడాను.
నేను అవతలి వాళ్ళను పర్సనల్ గా టార్గెట్ చేయలేదు. వాళ్ళు రాజకీయంగా ఏదయినా తప్పు చేస్తే వాటిని మాత్రమే ఎత్తి చూపుతాను. పవన్ కళ్యాణ్ గారు చెప్పేది అదే. ఎవర్ని పర్సనల్ గా టార్గెట్ చేయొద్దు అని అంటారు. అవతలి వాళ్ళు పర్సనల్ గా టార్గెట్ చేసినా మనం చేయొద్దు, చేస్తే వాళ్లకు, మనకు తేడా ఏముంటుంది అంటారు. అందుకే నేను పర్సనల్ గా ఎవ్వర్నీ టార్గెట్ చేయను.
అన్ని వదిలేసి పార్టీలోకి వెళ్లి పని చేయాలి అని లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి కోసం, ఆయన పార్టీ కోసం ఎప్పుడు అవసరం వచ్చినా పని చేస్తాను. దానికోసం నేను సినిమాలు, నా వర్క్ వదులుకొని చేయను. అది పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇష్టం ఉండదు. మన పని వదిలేసి ఆయన కోసం తిరగడం ఆయనకు నచ్చదు. ఆ సమయానికి పని ఉంటే వెళ్లి చేయాలి. అదే ఆయన కోరుకుంటారు. మన జీవనాధారం వదిలేసి పార్టీ కోసం తిరగమని పవన్ కళ్యాణ్ గారు చెప్పరు. మన పని చేసుకుంటూనే ఫ్రీ టైంలో ఇష్టం ఉంటే ఆయన కోసం పని చేయమంటారు. కళ్యాణ్ గారిని ఎవరన్నా ఏమన్నా అంటే మాత్రం ఊరుకోను, నేను ట్రిగ్గర్ అవుతాను, ఆయన్ని అన్న వాళ్ళ తప్పులు బయటకు తీసి మాట్లాడతాను అని అన్నారు.
Also Read : Avatar Fire and Ash : ‘అవతార్ 3 : ఫైర్ అండ్ ఆష్’ మూవీ రివ్యూ.. మళ్ళీ పార్ట్ 2నే తీశారు కదరా బాబు..
దీంతో హైపర్ ఆది జనసేన నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి మాత్రం రాడని, కేవలం ప్రచారం మాత్రమే చేస్తాడని తెలుస్తుంది.
