Naresh and Pavitra Lokesh file a case on some youtube channels and wesites
Naresh – Pavitra Lokesh : టాలీవుడ్ నటులు నరేష్, పవిత్ర లోకేష్ కోర్ట్ మెట్లు ఎక్కారు. సీనియర్ హీరో నరేష్ గత కొంతకాలంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్రా లోకేశ్ తో రిలేషన్‌షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ముందుగా వీరిద్దరూ ఈ సంబంధాన్ని గుట్టగా మెయిన్‌టెన్ చేస్తూ వచ్చారు. కానీ కొన్ని నెలల క్రిందట నరేశ్ మూడో భార్య అయిన రమ్య రఘుపతి.. బెంగళూరులోని ఒక హోటల్ లో వీరిద్దరి రిలేషన్ ని బహిర్గతం చేయడంతో, అప్పటి నుంచి నరేష్ అండ్ పవిత్ర ఎక్కడ కనిపించిన జంటగానే కనిపిస్తూ వస్తున్నారు.
Naresh-Pavitra : హోటల్‌లో నరేశ్, పవిత్రా.. చెప్పుతో కొట్టడానికొచ్చిన నరేష్ మూడో భార్య..
ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ మరణం సమయంలో కూడా అయన భౌతికకాయాన్ని చూడడానికి జంటగా వచ్చి టాక్ అఫ్ ది టౌన్ గా మారిపోయారు. ఇక వీరిద్దరి రిలేషన్ పై పలు వెబ్ సైట్ లు అనేక కథనాలు రాసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే పవిత్ర లోకేష్.. ఘట్టమనేని కుటుంబంలో నమ్రతకి ఇచ్చిన కోడలు హోదా, తనకి ఇవ్వాలంటూ డిమాండ్ చేసినట్లు కొన్ని యూట్యూబ్ చానెల్స్ మరియు వెబ్ సైట్ లు రాసుకొచ్చాయి.
అయితే ఆ వార్తల్లో నిజం లేకపోవడంతో, అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారంటూ నరేష్ అండ్ పవిత్ర లోకేష్ కోర్ట్ ని ఆశ్రయించారు. కొన్ని యూట్యూబ్ అండ్ వెబ్ సైట్స్ పై పరువు నష్టం దావా కేసు వేస్తూ నాంపల్లి కోర్ట్ లో కేసు ఫైల్ చేశాడు. దీంతో కోర్ట్.. మొత్తం 12 మందిపై విచారణ చేపట్టాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులను ఆదేశించింది.