Naresh : ఒకప్పుడు హీరోగా బోలెడన్ని సక్సెస్ సినిమాలతో మెప్పించిన నరేష్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నారు. చేతి నిండా సినిమాలతో డిఫరెంట్ పాత్రలతో మెప్పిస్తున్నారు నరేష్. నరేష్ తాజాగా బ్యూటీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.(Naresh)
బ్యూటీ సినిమాలో హీరోయిన్ కి తండ్రి పాత్రలో నటించారు నరేష్. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Also Read : Junior : శ్రీలీల – జెనీలియా కలిసి నటించిన సినిమా.. ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఎప్పుడు? ఏ ఓటీటీలో..
నరేష్ గత కొంతకాలంగా సీనియర్ నటి పవిత్ర లోకేష్ తో ఉంటున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్టు అధికారికంగా ప్రకటించకపోయినా ఇద్దరూ కలిసే ఉంటున్నట్టు, పెళ్లి చేసుకున్నారని అందరికి తెలిసేలా చేసారు.
ఇంటర్వ్యూలో నిక్ నేమ్స్ గురించి ప్రస్తావన రాగా నరేష్ మాట్లాడుతూ..మా అమ్మ నరి అని పిలిచేది. నరి అంటే తమిళంలో నక్క. దాంతో మా ఫ్రెండ్స్ అంతా ఫాక్స్ అని పిలిచేవాళ్ళు. ముద్దొస్తే నారి అని పిలిచేది. మరీ ప్రేమ ఎక్కువయి ముద్దుగా పిలిస్తే నారిగా అని పిలిచేది. అలాంటప్పుడు కాకా పట్టొచ్చు అని అర్ధమయ్యేది నాకు. ఇంక నన్ను అలా ఎవ్వరూ పిలవరు. పవిత్ర లోకేష్ నన్ను చాలా గౌరవంగా పిలుస్తుంది. ముద్దుపేరు అయితే రాయ అని పిలుస్తుంది. అది ముద్దు పేరు కాదు కానీ అలా షార్ట్ గా పిలుస్తుంది అని అన్నారు.
Also Read : Bhadrakaali Review : విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ మూవీ రివ్యూ.. ఒక బ్రోకర్ ఏం చేశాడు..