Junior : శ్రీలీల – జెనీలియా కలిసి నటించిన సినిమా.. ఓటీటీలోకి వచ్చేస్తుంది.. ఎప్పుడు? ఏ ఓటీటీలో..
శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతోనే జెనీలియా మళ్ళీ సౌత్ లో రీ ఎంట్రీ ఇచ్చింది. (Junior)

Junior
Junior : గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డిని హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా ‘జూనియర్’. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మాణంలో రాధా కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరెక్కింది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా జెనీలియా కీలక పాత్రలో నటించింది. ఈ జూనియర్ సినిమా జులై 18న రిలీజ్ అయి పర్వాలేదనిపించింది. ఈ సినిమాతోనే జెనీలియా మళ్ళీ సౌత్ లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తెలుగు – కన్నడలో రిలీజయింది.(Junior)
Also Read : Bhadrakaali Review : విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ మూవీ రివ్యూ.. ఒక బ్రోకర్ ఏం చేశాడు..
జూనియర్ సినిమా రిలీజ్ కి మూడు నాలుగేళ్లు సమయం తీసుకుంది. ఎప్పుడో కరోనా సమయంలో రావాల్సిన సినిమా అనేక వాయిదాల తర్వాత ఇటీవల జులై లో రిలీజయింది. ఓటీటీలో కూడా లేట్ గానే వస్తుంది. జూనియర్ సినిమా తెలుగు వర్షన్ మొత్తానికి ఆహా ఓటీటీలోకి వచ్చేస్తుంది. సెప్టెంబర్ 22 నుంచి జూనియర్ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇక కన్నడ వర్షన్ నమ్మ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కి రానుంది.
View this post on Instagram