తెలుగు సినిమా వాళ్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఎన్నికలు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు. మార్చి 10వ తేదీన ఈ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా పదవీకాలం ముగియడంతో “మా”కు ఎన్నికలు జరగబోతున్నాయి. మొత్తం 800మంది సభ్యులు ఈ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోనుండగా.. ‘మా’ అధ్యక్ష పదవికి సీనియర్ హీరో నరేష్ పోటీ పడుతున్నారు. నరేష్ ప్యానెల్ లో జీవితా, రాజశేఖర్‌తో పాటు మరికొంతమంది పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ హీరోలను కలిసి మద్దతు అడుగున్న నరేష్ ప్యానెల్.. మహేష్ బాబును తొలుత కలిసి మద్దతు అడిగారు. ఇఫ్పుడు మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిసి తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా చిరంజీవి సానుకూలంగా స్పందించినట్లు నరేష్ ట్వీట్ చేసి, వివాదాలకు దూరంగా ఉండాలని సూచించినట్లు వెల్లడించారు. గత ఎన్నికల సమయంలో అనేక గొడవలు జరిగిన నేపథ్యంలో ఈసారి అటువంటి గొడవలు జరగకుండా ఉండాలని అందరూ భావిస్తున్నారు.
My panel comprising of Dr @ActorRajasekhar and Jeevitha, along with the entire panel met Sri #Chiranjeevi garu and sought his blessings. He responded positively and extended his support to one and all. (1/2) pic.twitter.com/GUxYQQMr1a
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 4, 2019
Me with my panel along with Dr @ActorRajasekhar , Jeevitha and others met superstar @urstrulyMahesh seeking his support for the future of Maa.
Mahesh Babu had responded very positively and promised to come for voting on 10th March pic.twitter.com/4fIDMsR4Lb
— H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) March 3, 2019