Nari Nari Naduma Murari movie streaming on Amazon Prime.
Nari Nari Naduma Murari OTT: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ నారీ నారీ నడుమ మురారి. సామజవరగమన మూవీ ఫేమ్ రామ్ అబ్బరాజు తెరకెక్కించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్స్ గా నటించారు. సినిమా సంక్రాంతి కానుకగా యూత్ ఫుల్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఒక రేంజ్ లో మెప్పించింది.
MSVG: ఇది మెంటల్ మాస్.. మెగాస్టార్ దెబ్బకి పుష్ప రికార్డ్స్ అవుట్.. టాప్ లో MSVG
చాలా కాలంగా సరైన హిట్ కోసం చూస్తున్న శర్వానంద్ కి సూపర్ హిట్ అందించింది ఈ సినిమా. కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది ఈ మూవీ. అయితే, తాజాగా నారీ నారీ నడుమ మురారి(Nari Nari Naduma Murari OTT) సినిమా ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ దక్కించుకున్న విషయం తెలిసిందే.
నారీ నారీ నడుమ మురారి సినిమాను ఫిబ్రవరి 4 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ కూడా విడుదల చేశారు. దీంతో ఓటీటీ ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, సంక్రాంతి పోటీ వల్ల థియేటర్స్ లో ఈ సినిమాను చాలా మంది చూడలేకపోయారు. కాబట్టి, ఓటీటీలో ఈ నారీ నారీ నడుమ మురారి సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడే అవకాశమ్ ఉంది. చూడాలి మరి ఈ సినిమాకు ఓటీటీ ఆడియన్స్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అని.