MSVG: ఇది మెంటల్ మాస్.. మెగాస్టార్ దెబ్బకి పుష్ప రికార్డ్స్ అవుట్.. టాప్ లో MSVG
అల్లు అర్జున్ పుష్ప సినిమా రికార్డ్స్ బ్రేక్ చేసిన మన శంకర వరప్రసాద్ గారు(MSVG) మూవీ.
Mana shankara varaprasad garu movie break Pushpa records.
- ఆగని మన శంకర వరప్రసాద్ గారు జోరు
- బాక్సాఫీస్ దగ్గర భారీ కలెక్షన్స్
- పుష్ప 1 రికార్డ్స్ బ్రేక్ చేసిన మన శంకర వరప్రసాద్ గారు
MSVG: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు(MSVG). వింటేజ్ లుక్ లో, ఫ్యామిలీ కంటెంట్ తో వచ్చి బ్లాక్ బస్టర్ ను షేక్ చేశాడు చిరంజీవి. కామెడీ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఓపక్క ఫ్యామిలీ ఎమోషన్, మరోపక్క ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ థియేటర్స్ దగ్గర క్యూ కట్టేశారు. దీతో బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది మన శంకర వరప్రసాద్ గారు సినిమా.
Rithu Chowdhary: అందాల మత్తు ఎక్కిస్తున్న రీతూ.. వైట్ డ్రెస్సులో హాట్ ఫోజులు.. ఫొటోలు
కేవలం వారం రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా రీజనల్ సినిమాల్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతేకాదు, ఈనేపథ్యంలోనే అనేక సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేసింది. అయితే, తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు మెగాస్టార్ సినిమా అల్లు అఅర్జున్ నటించిన పుష్ప సినిమా రికార్డ్స్ ను కూడా బ్రేక్ చేసిందట. అవును, పాన్ ఇండియా లెవల్లో వచ్చిన పుష్ప సినిమాలో ఓవరాల్ గా రూ.350 కోట్ల వసూళ్లను రాబట్టింది.
కానీ, కేవలం 18 రోజుల్లోనే రూ.358 కోట్ల కలెక్షన్స్ రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది మన శంకర వరప్రసాద్ గారు సినిమా. దీంతో, మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కూడా ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఎగబడుతున్నారు. కాబట్టి, రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు మన శంకర వరప్రసాద్ గారు సినిమా రూ.400 కోట్లకి పైగా వసూళ్లు సాధించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అదే గనక నిజం అయితే రీజనల్ సినిమాల్లో ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టిన హీరోగా రికార్డ్స్ క్రియేట్ చేస్తాడు మెగాస్టార్.
