Mad Movies
Mad Movies : సితార నిర్మాణ సంస్థ ఎంటర్టైన్మెంట్ సినిమాలు రిలీజ్ చేస్తూ హిట్స్ కొడుతుంది. చిన్న చిన్న సినిమాలతో కూడా హిట్స్ కొట్టింది. ఈ క్రమంలో మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ లాంటి ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు సితార సంస్థ నాగవంశీ నిర్మాణం నుంచి వచ్చి పెద్ద హిట్ అయ్యాయి.(Mad Movies)
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్, విష్ణు మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన మ్యాడ్ పెద్ద హిట్ అవ్వడంతో దానికి సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ కూడా తీసి హిట్ కొట్టారు. ఈ సినిమాకు మరో సీక్వెల్ మ్యాడ్ 3 కూడా ఉంటుందని అప్పుడే ప్రకటించారు.
Also See : Deepika Pilli : బాబోయ్.. దీపికా పిల్లి ఇంత పద్దతిగానా.. పట్టుచీరలో పరువాలు..
అయితే తాజాగా నిర్మాత నాగవంశీ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మ్యాడ్ 3 సినిమా లేదు. మ్యాడ్ జూనియర్స్ అని తెరకెక్కిస్తున్నాము. మ్యాడ్ స్క్వేర్ కథ జరిగిన నాలుగేళ్ల తర్వాత అదే కాలేజీలో అందరూ కొత్తవాళ్లతో నడిచే కథ. మిస్డ్ సినిమాల్లో ఉన్న వాళ్ళెవరూ ఈ సినిమాలో ఉండరు. అందరూ కొత్తవాళ్ళతోనే తీస్తున్నాము అని తెలిపారు.
దీంతో మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ సినిమా నటీనటులు లేకుండానే నెక్స్ట్ మ్యాడ్ సినిమా మ్యాడ్ జూనియర్స్ అనే టైటిల్ తో కొత్తవాళ్లతో రాబోతుందని తెలుస్తుంది. 2026 లోనే ఈ సినిమా షూటింగ్ జరగనుందని సమాచారం. ఆ సినిమాల్లో నటించిన కొంతమంది మాత్రం గెస్ట్ అప్పిరెస్ట్ ఇస్తారేమో చూడాలి. మరి రెండు మ్యాడ్ సినిమాలు మెప్పించాయి ఈ మూడో మ్యాడ్ ఏం చేస్తుందో..
Also See : Samantha : భర్తతో కలిసి హనీమూన్ కి వెళ్లిన సమంత.. ఏ దేశానికో తెలుసా..? న్యూ ఇయర్ అక్కడే..