Narne Nithiin Speech in front of NTR in Mad Square Success Event
Narne Nithiin – NTR : ఎన్టీఆర్ బామ్మర్ది నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు.. పలువురు మెయిన్ లీడ్స్ లో తెరకెక్కిన మ్యాడ్ స్క్వేర్ సినిమా ఇటీవల మార్చ్ 28న రిలీజయి పెద్ద హిట్ అయింది. ఇప్పటికే ఈ సినిమా 75 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. తాజాగా నేడు ఈ సినిమా సక్సెస్ ఈవెంట్ నిర్వహించారు. మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా వచ్చారు.
ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ బామ్మర్ది మాట్లాడుతూ.. బావ గారి ముందు ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. జనతా గ్యారేజ్ నుంచి ఒక డైలాగ్ చెప్పాలని ఉంది. ఒక బలహీనుడి వెనకాల ఒక బలవంతుడు ఉంటాడు. మా మ్యాడ్ 1 సినిమాకు బజ్ లేనప్పుడు బావ వచ్చి ట్రైలర్ రిలీజ్ చేసారు. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఈ సినిమా చూసి బావ ఒక మాట చెప్పాడు. నీలో యాక్టింగ్ లో ఈజ్ ఇంకా పెరిగింది అన్నారు. థ్యాంక్యూ బావ. దానికి కారణం మా డైరెక్టర్ అని చెప్పి మూవీ యూనిట్ అందరికి థ్యాంక్స్ చెప్పారు.
ఎన్టీఆర్ ముందు మొదటిసారి ఎన్టీఆర్ బామ్మర్ది సక్సెస్ ఈవెంట్లో ఇలా మాట్లాడటంతో ఈ స్పీచ్ వైరల్ గా మారింది.