BiggBoss Non Stop : బిగ్‌బాస్ నుంచి నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్.. రెండో సారి కూడా అర్దాంతరంగానే..

ఆదివారం బిగ్‌బాస్ నుంచి నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయిపోయారు. గతంలో కూడా పాల్గొన్న నటరాజ్ మాస్టర్ అందరితో గొడవలు పెట్టుకుంటూ, ఎమోషనల్ అవుతూ............

BiggBoss Non Stop : బిగ్‌బాస్ నుంచి నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్.. రెండో సారి కూడా అర్దాంతరంగానే..

Nataraj

Updated On : May 16, 2022 / 10:54 AM IST

BiggBoss Non Stop :  బిగ్‌బాస్ ఈ సారి ఓటీటిలో టెలికాస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. గత సీజన్లతో పోలిస్తే ఈ సారి అంత గొప్పగా ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. ఓటీటీలో టెలికాస్ట్ అవ్వడం, గతంలో పాల్గొన్న వారే మళ్ళీ కంటెస్టెంట్స్ గా కొంతమంది రావడంతో ఈ సారి బిగ్‌బాస్ అంతగా ఆకట్టుకోలేకపోతుంది. ఈ సారి బిగ్‌బాస్ కి హైప్ తీసుకురావడానికి ప్రతి వారం ఎవరో ఒక సెలబ్రిటిని తీసుకొచ్చి ప్రమోట్ చేశారు.

ఆదివారం బిగ్‌బాస్ నుంచి నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయిపోయారు. గతంలో కూడా పాల్గొన్న నటరాజ్ మాస్టర్ అందరితో గొడవలు పెట్టుకుంటూ, ఎమోషనల్ అవుతూ లాస్ట్ టైం తొందరగా వెళ్ళిపోయాడు. ఈ సారి అనుభవం ఉంది కదా అనుకుంటే ఈ సారి కూడా గతంలో లాగానే గొడవలు పెట్టుకొని, మాటి మాటికీ ఎమోషనల్ అవుతూ ఉండటంతో ఆడియన్స్ మళ్ళీ పంపించేశారు నటరాజ్ మాస్టర్ ని.

Mahesh Babu : సర్కారు వారి పాట.. మ మ మాస్ సెలబ్రేషన్స్.. కర్నూలులో..

షో నుండి నటరాజ్ ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం ఏడుగురు హౌస్ లో ఉన్నారు. బిందు మాధవి, అఖిల్ సార్థక్, అనిల్, శివ, బాబా భాస్కర్, అరియానా, మిత్రాశర్మ ప్రస్తుతం హౌస్ లో ఉన్నారు. ఇక వచ్చే వారమే టాప్ 5ని సెలెక్ట్ చేస్తారని, మరో రెండు వారాల్లో బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ ని ముగిస్తారని తెలుస్తుంది. మరి ఈ సారి బిగ్‌బాస్ విన్నర్ ఎవరు అవుతారో చూడాలి.