1920 Bheemunipatnam : ‘1920 భీమునిపట్నం’.. స్వతంత్ర పోరాట నేపథ్యంలో మరో సినిమా..

నేషనల్ అవార్డు విన్నర్ నరసింహ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా '1920 భీమునిపట్నం'.

1920 Bheemunipatnam : ‘1920 భీమునిపట్నం’.. స్వతంత్ర పోరాట నేపథ్యంలో మరో సినిమా..

National Award Winner Narasimha Nandi New Movie 1920 Bhimunipatnam Shoot Started

Updated On : March 2, 2024 / 12:11 PM IST

1920 Bheemunipatnam : కంచర్ల ఉపేంద్ర, అపర్ణాదేవి జంటగా నేషనల్ అవార్డు విన్నర్ నరసింహ నంది(Narasimha Nandi) దర్శకత్వంలో SSLS క్రియేషన్స్ బ్యానర్ పై కంచర్ల అచ్యుతరావు నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా ‘1920 భీమునిపట్నం’. భారత స్వాతంత్ర ఉద్యమం నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో జరిగింది. బ్రిటీష్ ప్రభుత్వ పోలీస్ అధికారి పాత్రలో కంచర్ల ఉపేంద్ర, ఓ స్వాతంత్ర సమరయోధుడి కుమార్తె పాత్రలో అపర్ణా దేవి కనిపించనున్నారు. యండమూరి ప్రవీణ్, ఘర్షణ శ్రీనివాస్, పవిత్ర లోకేష్, తిలక్, జెన్నీ.. పలువురు ముఖ్య పాత్రలు పోషించనున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర పోరాట నేపథ్యంలో ఈ 1920 భీమునిపట్నం సినిమాని భావోద్యేగాలతో తెరకెక్కిస్తున్నాం. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా తీసుకొని ఈ సినిమాని చేస్తున్నాం అని తెలిపారు.

Also Read : Nayanthara Vignesh Shivan : ఆ స్టేటస్ పెట్టి.. భర్తని అన్ ఫాలో చేసిన నయనతార.. ఏమైంది అంటూ ఫ్యాన్స్ కంగారు..

ఇక ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తర్వాత రాజమండ్రి, విశాఖపట్నం, అరకు, ఊటీలలో షూటింగ్ జరగనుంది.

National Award Winner Narasimha Nandi New Movie 1920 Bhimunipatnam Shoot Started