Natti Kumar : సినిమా టికెట్ రేట్లపై ఇచ్చిన జీవోలో మరిన్ని సవరణలు కావాలి..

నట్టి కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ''టిక్కెట్ రెట్లు పెంచుతూ కొత్త జీవో ఇచ్చినందుకు చిత్ర పరిశ్రమ తరపున ఏపి సిఎం జగన్ గారికి కృతజ్ఞతలు. మరో మూడు విజ్ఞప్తులు కూడా పరిశీలించి........

Natti Kumar :  మొత్తానికి ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ముగింపు వచ్చింది. ఇటీవల తగ్గించిన సినిమా చార్జీలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం కొత్త జీవోని విడుదల చేసింది. దీనిపై సినీ నటులు, నిర్మాతలు, ఫిలిం ఛాంబర్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై డిస్ట్రిబ్యూటర్, నిర్మాత నట్టి కుమార్ మీడియాతో మాట్లాడారు.

నట్టి కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ”టిక్కెట్ రెట్లు పెంచుతూ కొత్త జీవో ఇచ్చినందుకు చిత్ర పరిశ్రమ తరపున ఏపి సిఎం జగన్ గారికి కృతజ్ఞతలు. మరో మూడు విజ్ఞప్తులు కూడా పరిశీలించి, పెద్దమనసుతో ఈ జీవోలో సవరణలు ఇవ్వగలరని మనవి. జగన్ గారు పెద్ద మనసుతో అర్ధం చేసుకుని సవరణలకు సంబందించిన విజ్ఞప్తులను కూడా పరిశీలించి, వాటిని కూడా పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం.”

”20 కోట్ల లోపు బడ్జెట్ సినిమాలను చిన్న సినిమాలుగా పరిగణిస్తున్నట్లుగా జీవోలో పేర్కొనడం జరిగింది. తమరికి మా విన్నపం ఏంటంటే 10 కోట్ల లోపు బడ్జెట్ సినిమాలను చిన్న సినిమాలుగా పరిగణిస్తే చిన్న సినిమాలకు న్యాయం జరుగుతుంది. అలాగే చిన్న సినిమాలను తప్పనిసరిగా ప్రదర్శించేలా ఉదయం 11 గంటలు, నైట్ 9 గంటలకు అనుమతులు రెండు షో లకు ఇవ్వడం సంతోషం. చిన్న సినిమాలను ఉదయం 11 గంటల వేళలలో ఎక్కువ మంది ప్రజలు చూడరు. అందువల్ల ఒక్క షో ఇచ్చినా మధ్యాహ్నం 2-30 PM కు అనుమతి ఇస్తే బావుంటుంది. కేవలం ఇది నా అభిప్రాయం మాత్రమే కాదు చిత్ర పరిశ్రమలోని చిన్న నిర్మాతల అందరి ఆకాంక్ష ఇదే. సినిమాటోగ్రఫీ చట్టం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8-30 గంటల నుంచి మిడ్ నైట్ 12 గంటల వరకు సినిమా ప్రదర్శనకు వీలుంది. అయితే కొత్త జీవో ప్రకారం ఉదయం 11 గంటల నుంచి ఐదు ఆటలు అంటే ప్రదర్శన మధ్యలో గ్యాప్ లేకుండా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. దీనిపై మరింత స్పష్టత ఉంటే బావుంటుందని నా విజ్ఞప్తి.”

Movie Ticket Rates : సినిమా టికెట్ రేట్లపై ఫిలింఛాంబర్ మీడియా సమావేశం

”అలాగే మల్టీప్లెక్స్ లో పేదవాడు సైతం సినిమా చూసేందుకు వీలుగా Non Premium Class seating Capacityలో 25 శాతం టికెట్లను 50 రూపాయల ధరను నిర్ణయిస్తే బావుంటుందని నా అభిప్రాయం. ఇప్పటికే మల్టీప్లెక్స్ లు సంఖ్యాపరంగా బాగా పెరిగాయి. ఇక భవిష్యత్ కూడా రానున్నది మల్టీప్లెక్స్ యుగమే. పేదవాడు సినిమా చూడాలన్నా, అలాగే చిన్న సినిమాలకు సౌలభ్యంగా 50 రూపాయల టిక్కెట్లను 25 శాతం Non Premium Class టిక్కెట్లను కేటాయిస్తే బావుంటుందని నా అభిప్రాయం. దీనిని తమరు పెద్ద మనసుతో అర్ధం చేసుకుని, వీటన్నింటినీ పరిశీలించి, తగిన న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను.”

Radheshyam : ఇవి కొంటే ప్రభాస్‌ని కలిసి అవకాశం..

”ఇక మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలతో పాటు చిత్ర పరిశ్రమ అంతా బావుండాలన్న ఉద్దేశ్యంతో చొరవ తీసుకుని గౌరవ ఏపీ సీఎం గారితో మాట్లాడి, సమస్యల పరిష్కారం కృషి చేసిన చిరంజీవి గారికి చిన్న నిర్మాతల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అంటూ సినిమా టికెట్లపై ఇచ్చిన జీవోలో కొన్ని సవరణలు చేయాలని తెలియచేశారు.

ట్రెండింగ్ వార్తలు