Movie Ticket Rates : సినిమా టికెట్ రేట్లపై ఫిలింఛాంబర్ మీడియా సమావేశం

ఎట్టకేలకు ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ముగింపు వచ్చింది. ఇటీవల తగ్గించిన సినిమా చార్జీలను గతంలో ఉన్న ఛార్జీలకు దగ్గరగా ఉండేలాగే పెంచుతూ కొత్త జీవోని రిలీజ్ చేశారు ఏపీ ప్రభుత్వం......

Movie Ticket Rates : సినిమా టికెట్ రేట్లపై ఫిలింఛాంబర్ మీడియా సమావేశం

Tfc

 

Movie Ticket Rates :  ఎట్టకేలకు ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ముగింపు వచ్చింది. ఇటీవల తగ్గించిన సినిమా చార్జీలను గతంలో ఉన్న ఛార్జీలకు దగ్గరగా ఉండేలాగే పెంచుతూ కొత్త జీవోని రిలీజ్ చేశారు ఏపీ ప్రభుత్వం. సినిమా టికెట్ల రేట్లని మరీ అధికంగా పెంచకపోయినా గతంలో తగ్గించిన చార్జీలతో పోలిస్తే కొద్దిగా పెంచారు. దీనిపై సినీ నటులు, నిర్మాతలు, ఫిలిం ఛాంబర్ ఏపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, పేర్ని నానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. తాజాగా ఈ అంశంపై ఫిలిం ఛాంబర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో నిర్మాతలు సి.కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ, ఎన్వీ ప్రసాద్, చదలవాడ శ్రీనివాస్ మరికొంతమంది నిర్మాతలు పాల్గొన్నారు.

ఈ మీడియా సమావేశంలో సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. ”వివాదాలకు తెరదించుతూ ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలపై జీవో ఇవ్వడం ఆనందంగా ఉంది. తెలుగు సినీ పరిశ్రమ తరపున ముఖ్యమంత్రి జగన్ గారికి ధన్యవాదాలు. ముఖ్యమంత్రికి వైజాగ్ లో చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాలనే కోరిక ఉంది. సినీ పరిశ్రమ వైజాగ్ కూడా ప్రాతినిధ్యం వహించేలా కృషి చేస్తాం. వైజాగ్ లో సినీ పరిశ్రమ అభివృద్ధిపై ఛాంబర్లో మరోసారి సమావేశమై చర్చిస్తాం. త్వరలోనే ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలుపుతాం” అని అన్నారు.

తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ”ఏపీ ప్రభుత్వం మా విన్నపాలను కొంత వరకు అమలు చేసినందుకు ధన్యవాదాలు. మిగిలిన సమస్యలను కూడా త్వరగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నాం” అని తెలిపారు.

Radheshyam : ఇవి కొంటే ప్రభాస్‌ని కలిసి అవకాశం..

ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ.. ”ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఎన్నో సంవత్సరాల సమస్యకు పరిష్కారం. అపరిష్కృతంగా ఉన్న పెద్ద సమస్యను ప్రభుత్వం పరిష్కరించింది. కొవిడ్ కన్నా కూడా జీవో 35తో డిస్ట్రిబ్యూటర్లు చాలా సతమతమయ్యారు. ఇప్పుడు విడుదల చేసిన జీవో మాకు చాలా సంతృప్తికరంగా ఉంది. ఇదే జీవో భీమ్లానాయక్ ముందు వచ్చి ఉంటే మరింత పాజిటివ్ గా ఉండేది. ఇంకా సినీ పరిశ్రమలో ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుంటాం. సినీ పరిశ్రమలోని సమస్యల పరిష్కారానికి చిరంజీవి ముఖ్య భూమిక పోషించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఫ్రెండ్లీ ప్రభుత్వాలుగా వ్యవహరిస్తున్నాయి.

Director Bala : ఇండస్ట్రీలో మరో విడాకులు.. భార్యతో విడిపోయిన స్టార్ డైరెక్టర్

చదలవాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ”తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమ చిత్రాలు వస్తున్నాయి. ప్రధాని మోడీ కూడా గుర్తించారు. మా ప్రొడక్ట్ మార్కెట్ చేసుకోవడానికి థియేటర్లు అవసరం. థియేటర్లు కళకళలాడితేనే సినీ పరిశ్రమ కళకళలాడుతుంది. ఇద్దరు ముఖ్యమంత్రులు ఫిల్మ్ ఛాంబర్ కు భూమి ఇవ్వండి. సినీ పరిశ్రమను వృద్ధిలోకి తీసుకురావడానికి ముఖ్యమంత్రుల సహకారం అవసరం” అని తెలిపారు.