Nani : డాబాపై రంగులతో అతిపెద్ద నాని దసరా లుక్ గీసిన మహారాష్ట్ర ఫ్యాన్స్.. బొమ్మ అదిరిపోయిందిగా..

మహారాష్ట్రకు చెందిన విపుల్ మిరాజ్‌కార్ అనే ఓ ఆర్టిస్ట్ రకరకాల బొమ్మలు, పెయింట్స్ వేస్తూ ఉంటాడు. రంగులతో బొమ్మలని గీస్తూ ఉంటాడు. నాని దసరా సినిమా మార్చ్ 30న రిలీజ్ ఉండటంతో నాని పై అభిమానంతో.................

Natural star Nani Dasara movie look draw on big size with colors by a Maharashtra fan

Nani :  ఇటీవల మన తెలుగు సినిమా దేశమంతటా విస్తరించి అన్ని చోట్లా భారీ విజయాలు సాధిస్తుంది. ఈ నేపథ్యంలో వేరే భాషల్లో కూడా మన హీరోలకు అభిమానులు ఏర్పడుతున్నారు. మన తెలుగు సినిమాలు చూస్తున్నారు, తెలుగు హీరోలని అభిమానిస్తున్నారు. తాజాగా ఓ అభిమాని మన న్యాచురల్ స్టార్ నానిపై తనకున్న అభిమానం వెరైటీగా చూపించాడు.

మహారాష్ట్రకు చెందిన విపుల్ మిరాజ్‌కార్ అనే ఓ ఆర్టిస్ట్ రకరకాల బొమ్మలు, పెయింట్స్ వేస్తూ ఉంటాడు. రంగులతో బొమ్మలని గీస్తూ ఉంటాడు. నాని దసరా సినిమా మార్చ్ 30న రిలీజ్ ఉండటంతో నాని పై అభిమానంతో విపుల్ మిరాజ్‌కార్ ఓ డాబాపై 25 * 30 అడుగులతో నాని దసరా లుక్ ని గీసి న్యాచురల్ కలర్స్ తో ఆ బొమ్మని నింపి అచ్చం కలర్ ప్రింట్ తీసినట్టు గీశాడు. విపుల్ మిరాజ్‌కార్ తో పాటు అతని స్నేహితులు ఇందులో పాలుపంచుకున్నారు.

Kajal Aggarwal : కాజల్ కంబ్యాక్ గట్టిగానే ప్లాన్ చేస్తోంది.. చేతిలో అరడజను ప్రాజెక్టులు..

ఈ బొమ్మ వేస్తున్న వీడియో తీసి, వేసిన తర్వాత డ్రోన్ తో బొమ్మ మొత్తం కనపడేలా పైనుంచి వీడియో తీసి ఈ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇప్పుడు ఇది వైరల్ గా మారింది. ఈ వీడియోని చూసిన వారంతా రంగులతో నాని బొమ్మ భలే గీశాడు అంటూ అభినందిస్తున్నారు. ఇక నాని అభిమానులు అయితే ఈ వీడియోని తెగ షేర్ చేస్తున్నారు.