నానికి జున్ను ముద్దులు.. క్యూట్ బర్త్‌డే విషెస్..

నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా తనయుడు అర్జున్ క్యూట్ విషెస్..

  • Published By: sekhar ,Published On : February 25, 2020 / 08:11 AM IST
నానికి జున్ను ముద్దులు.. క్యూట్ బర్త్‌డే విషెస్..

Updated On : February 25, 2020 / 8:11 AM IST

నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు సందర్భంగా తనయుడు అర్జున్ క్యూట్ విషెస్..

ఫిబ్రవరి 24 నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు.  సినీ పరిశ్రమకు చెందిన పలువురు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియచేశారు. పుట్టినరోజు నాడు తండ్రీకొడుకుల మధ్య ఉన్న ప్రేమానురాగాలను హీరో నాని మరోసారి ప్రేక్షకులకు చూపించాడు. తన బర్త్‌డే సందర్భంగా కుటుంబ సభ్యులతో గడిపిన ఆనంద క్షణాలకు సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు నేచురల్ స్టార్.

నానికి తనయుడు అర్జున్ (జున్ను) పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ తండ్రిని ముద్దులతో ముంచేశాడు. తన చిట్టిచిట్టి చేతులతో నాని బుగ్గలను గిల్లుతున్న వీడియో క్యూట్‌గా ఉంది. కొడుకు అర్జున్ సందడిని చూసి నాని మురిసిపోయి.. ఈ మధురమైన క్షణాలను వీడియోలో షూట్ చేసి ప్రేక్షకులతో పంచుకున్నాడు.

ఈ వీడియో సోషల్ మీడియాలతో వైరల్ అవుతోంది. నాని నిర్మించిన ‘హిట్’ ఫిబ్రవరి 28న, నెగెటివ్ రోల్ చేసిన ‘వి’ ఉగాది కానుకగా మార్చి 25న, ‘శ్యామ్ సింగ రాయ్’ క్రిస్మస్ స్పెషల్‌గా డిసెంబర్ 25న విడుదల కానున్నాయి.

See Also>>ఆ రికార్డ్ సాధించిన ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్ రౌడీనే..