Naveen Polishetty : మెగాస్టార్ తో పోటీగా నవీన్ పోలిశెట్టి.. సంక్రాంతి బరిలో ‘అనగనగా ఒక రాజు’..
గ్యాప్ తర్వాత నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' సినిమాతో రాబోతున్నాడు.

Naveen Polishetty Anaganaga Oka Raju Movie Release Date Announced
Naveen Polishetty : ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలతో హిట్స్ కొట్టి అందర్నీ నవ్వించి బాగా పాపులారిటీ తెచ్చుకున్నాడు నవీన్ పోలిశెట్టి. ఇటీవల నవీన్ కి ఒక యాక్సిడెంట్ అవ్వడంతో కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్ తర్వాత నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో రాబోతున్నాడు.
నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా అనగనగా ఒక రాజు సినిమా తెరకెక్కుతుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణంలో మారి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా అనగనగ ఒక రాజు సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ సినిమాని 2026 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. 2026 జనవరి 14న ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించారు.
Also Read : Vishnupriya : అందుకే నేను హీరోయిన్ గా చేయకూడదు అని డిసైడ్ అయ్యా.. బాలీవుడ్, తమిళ్ నుంచి ఆఫర్స్ వచ్చాయి..
అయితే ఇప్పటికే సంక్రాంతి బరిలో చిరంజీవి – అనిల్ రావిపూడి సినిమా ఉంది. వీరిద్దరి కాంబో అంటే భారీ సినిమా, భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ప్రతి సంక్రాంతికి మూడు నుంచి నాలుగు పెద్ద సినిమాలే రిలీజ్ అవుతాయి కాబట్టి ఈ సంక్రాంతికి మెగాస్టార్ తో నవీన్ పోలిశెట్టి అనగనగ ఒక రాజు సినిమాతో పోటీగా వచ్చినా కచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అందులోని నవీన్ సినిమా అంటే ఫుల్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి అందరూ కనెక్ట్ అయిపోతారు.