Miss Shetty Mr Polishetty : మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో నవీన్ పోలిశెట్టి రికార్డులు..

షారుఖ్ ఖాన్ వంటి స్టార్ నటించిన 'జవాన్' మూవీతో పాటు రిలీజ్ అయిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా' సినిమాతో నవీన్ పోలిశెట్టి రికార్డులు సొంతం చేసుకుంటున్నాడు.

Miss Shetty Mr Polishetty : మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో నవీన్ పోలిశెట్టి రికార్డులు..

Naveen Polishetty Anushka Shetty Miss Shetty Mr Polishetty collections

Updated On : September 25, 2023 / 8:33 PM IST

Miss Shetty Mr Polishetty : న‌వీన్ పొలిశెట్టి (Naveen Polishetty) స్టాండప్ కమెడియన్‍‌గా, అనుష్క శెట్టి (Anushka Shetty) చెఫ్‌గా నటిస్తూ ఆడియన్స్ తీసుకు వచ్చిన సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీని కొత్త దర్శకుడు పి.మ‌హేష్ బాబు డైరెక్ట్ చేశాడు. సెప్టెంబ‌ర్ 7న తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్టుగా నిలిచింది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా వచ్చిన ఈ మూవీ.. సకుటుంబ ప్రేక్షకులని ఆకట్టుకుని బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది.

Jawan : ఆ రికార్డు సాధించిన మొదటి హీరోగా షారుఖ్ ఖాన్.. జవాన్ మూవీ..

ఈ సినిమా రిలీజ్ అయ్యి మూడు వారాలు పూర్తి అయినా ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద జోరు కొనసాగిస్తూనే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో, యూఎస్ లో మంచి వసూళ్లు రాబడుతుంది. తాజాగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది. షారుఖ్ ఖాన్ వంటి స్టార్ నటించిన ‘జవాన్’ మూవీతో పాటు రిలీజ్ అయ్యి, దాని తాకిడిని తట్టుకొని ఈ రేంజ్ కలెక్షన్స్ సాధించడం మాములు విషయం కాదు.

నవీన్ పోలిశెట్టి లాస్ట్ మూవీ ‘జాతిరత్నాలు’ కూడా యాభై కోట్ల మార్క్ ని క్రాస్ చేసింది. ఇప్పుడు ఈ చిత్రం కూడా ఈ మార్క్ ని అందుకోవడంతో.. నవీన్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. కాగా ఈ మూవీ యూఎస్ లో రికార్డులు సృష్టిస్తుంది. ఈ మూవీ రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే 1 మిలియన్ మార్క్ ని అందుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది. నవీన్ పోలిశెట్టికి ఇది రెండో మిలియన్ మార్క్ మూవీ.

Muralitharan : వెంకటేష్, నాని గురించి క్రికెటర్ మురళీధరన్ కామెంట్స్.. ఎన్టీఆర్ ప్రభాస్‌ని కూడా..

అయితే ఈ సినిమా కేవలం ఒక మిలియన్ దగ్గరే ఆగిపోకుండా.. 2M మార్క్ వైపు పరుగులు పెడుతుంది. ప్రస్తుతం నవీన్ అమెరికాలోనే ఉంటూ.. అక్కడ సందడి చేస్తున్నాడు. ఏదేమైనా ఈ మూవీ నవీన్ పోలిశెట్టికి రికార్డులు తెచ్చిపెడుతుంది. ‘ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’, ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకొని హ్యాట్రిక్ హిట్టుని అందుకున్నాడు.